Health Benefits : ఇవి తింటే హుక్కు లాంటి శరీరం మీ సొంతం.. పవర్ ఫుల్ గా మారతారు…!
ప్రధానాంశాలు:
Health Benefits : ఇవి తింటే హుక్కు లాంటి శరీరం మీ సొంతం..పవర్ ఫుల్ గా మారతారు...!
Health Benefits : ఎముకలను బలంగా చేయడానికి కాల్షియం ఒక ముఖ్యమైన పోషకమని అందరికీ తెలిసిందే. దీనికోసం చాలామంది పాలు జున్ను పెరుగు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం పాలు మరియు దాని ఉత్పత్తులకు చాలా దూరంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో ఎముకలకు కాల్షియం అందడం చాలా కష్టంగా మారుతుంది.ఎముకలకు కావాల్సిన క్యాల్షియం అందకపోతే ఎముకలు దృఢంగా ఉండవు. దీనికోసం ఆహారంలో నల్ల నువ్వులను చేర్చుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నల్ల నువ్వులలో పాలకంటే ఎక్కువ శాతం క్యాల్షియం లభిస్తుంది. నల్ల నువ్వులు కాల్షియంకి అద్భుతమైన మూలం. అందుకే వీటిని తీసుకోవడం వలన ఎముకల పెరుగుదల మరియు బలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి నల్ల నువ్వులు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Health Benefits కాల్షియం…
పాలలో కేవలం 123 mg కాల్షియం ఉంటుంది. కానీ నల్ల నువ్వులలో మాత్రం 1286 mg కాల్షియం ఉంటుంది. అంటే పాలతో పోల్చి చూస్తే నల్ల నువ్వులలో ఎక్కువ కాల్షియం లభిస్తుంది. కావున మీకు పాలు పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోవాలి అనిపించకపోతే నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకోవచ్చు.
Health Benefits ఇతర ప్రయోజనాలు…
నల్ల నువ్వులలో కాల్షియం మాత్రమే కాకుండా శరీరానికి ఎంతో అవసరమయ్యే మెగ్నీషియం ఫాస్ఫరస్ లాంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే నల్ల నువ్వులలో అధిక మొత్తంలో జింకు కూడా లభిస్తుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా ఎముకలు విరగకుండా బలంగా ఉంటాయి. అలాగే అర్థారైటీస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి నల్ల నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే నల్ల నువ్వులలో ఉండే యాంటీఇంప్లిమెంటరీ గుణాలు కీళ్లవాపులు తగ్గించడానికి సహాయ పడతాయి..
Health Benefits ఎప్పుడు ఎలా తీసుకోవాలి..
నల్ల నువ్వులను పచ్చిగా లేదా కొద్దిగా కాల్చిన తర్వాత తీసుకోవచ్చు. అయితే వీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాక వీటిని సలాడ్, కూరగాయలు ,నూడిల్స్ లేదా అన్నంలో కూడా కలిపి తీసుకోవచ్చు. Health benefits of Black sesame seeds