Apricot Fruit : పండు కాదు దివ్య ఔషధం… ప్రతిరోజు తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Apricot Fruit : పండు కాదు దివ్య ఔషధం… ప్రతిరోజు తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో…!

 Authored By ramu | The Telugu News | Updated on :2 January 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Apricot Fruit : పండు కాదు దివ్య ఔషధం... ప్రతిరోజు తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో...!

Apricot Fruit : ఆఫ్రికాట్స్ పేరు ఎప్పుడైనా విన్నారా. పరిమాణంలో చిన్నగా గుండ్రంగా పసుపు రంగులో పీచును కలిగిన రేగుపండ్లు లాగా కనిపించే వాటిని ఆఫ్రికాట్లు అని పిలుస్తారు. ఈ పండు పరిమాణంలో చిన్నదైనప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అధిక మొత్తంలో ఉంటాయి. ఇక ఈ ఆఫ్రికాట్స్ ను తీసుకోవడం వలన శరీరంలో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆఫ్రికాట్లు అనేక పోషక విలువలతో పాటు మెరుగైన జీర్నక్రియ మరియు కంటి ఆరోగ్యానికి అతి ముఖ్యమైనవిగా పని చేస్తాయి. అలాగే ఆఫ్రికాట్స్ లో విటమిన్ సి ఏ ,ఫైటో న్యూట్రియంట్లు సమృద్ధిగా ఉంటాయి .

Apricot Fruit పండు కాదు దివ్య ఔషధం ప్రతిరోజు తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Apricot Fruit : పండు కాదు దివ్య ఔషధం… ప్రతిరోజు తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో…!

ఇవి చర్మానికి మేలును కలిగించి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి. అంతేకాక వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేసేందుకు ఇవి ఎంతగానో సహయపడతాయి . ఇక ఆఫ్రికాట్లు ప్లేవా నాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాలు ,కెరోటి నాయుడ్లు, అస్పోలిఫైనల్స్ వంటి వివిధ కెమికల్స్ కూడా ఉంటాయి. అందుకే ఇవి మంచి రంగు రుచితో పాటు అధిక పోషక విలువను కలిగి ఉంటాయి. ఇక ఈ పండ్లను తాజాగా తినడమే కాకుండా డ్రై ఫ్రూట్స్ గా కూడా తీసుకోవచ్చు. కొందరు వీటిని వంటలలో కూడా ఉపయోగిస్తారు.

జీర్ణ క్రియను మెరుగుపరచడానికి , ఎముకలు దృఢంగా ఉండడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఆఫ్రికాట్లు ఎంతగానో దోహదపడుతాయి.అయితే ఈ ఆఫ్రికాట్లను ప్రతిరోజు ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిని నానబెట్టి తీసుకోవడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది