Black Pepper : నల్ల మిరియాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!
ప్రధానాంశాలు:
Black Pepper : నల్ల మిరియాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!
Black Pepper : భారతీయ వంటకాలలో మిరియాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఈ మిరియాలను బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ మిరియాలను మన రోజువారి ఆహారంలో చేర్చుకున్నట్లైతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మిరియాలలో మెగ్నీషియం ఐరన్ పొటాషియం ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాక దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఫంగల్ వంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి….
అందుకే ప్రతిరోజు మిరియాలు తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు దగ్గు ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు మిరియాలు తీసుకోవటం చాలా మంచిది. అంతేకాక మిరియాలలో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్యాస్ మలబధకం వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. అంతేకాక జీర్ణక్రియను మరియు రక్తప్రసరణను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ముఖ్యంగా మిరియాల లో ఫేవరెన్ అనే రసాయనం అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఇన్సులని ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా సహాయ పడతాయి. అంతేకాక రోజువారి ఆహారంలో మిరియాలు తీసుకోవడం వలన విటమిన్లు బి-సి , బీటా కెరోటిన్ వంటి పోషకాల వలన షోషణ మెరుగుపడుతుంది.
అలాగే మిరియాలలో ఉండే పైపేరిన్ శరీరంలో ప్రో ఇన్ఫ్లమేటరీ పదార్థాల ఉత్పత్తిని నిరోధిస్తాయి..అంతేకాక మిరియాలు ఆస్తమా వాపు వంటి సమస్యలు తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. అలాగే కొవ్వు విచ్చనం చేయడంలో మిరియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీంతో బరువు సులువుగా తగ్గవచ్చు. అదేవిధంగా గుండె జబ్బులు క్యాన్సర్ ఉబ్బరం డయాబెటిస్ లాంటి సమస్యలతో బాధపడేవారు మిరియాలను ప్రతిరోజు వారి ఆహారంలో తీసుకోవడం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే చిన్న వయసులోనేవృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా కనిపించేందుకు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మిరియాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.