Health Benefits : సెలబ్రిటీస్ ఆరోగ్య రహస్యం… వర్షాకాలంలో కూడా వీటిని తినకుండా ఆపరు…
Health Benefits : కీర దోసకాయలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కీరదోసకాయలను వేసవి కాలంలో తినడానికి ఇష్టపడతారు. కీరదోసకాయ చలువ చేస్తుంది. నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దాహం తీరుస్తుంది అని, పొట్టకి హాయిగా ఉంటుందని ఇలాంటి కారణాలతో ఎండాకాలంలో కీర దోసకాయలను బాగా తింటారు. అయితే కొంతమంది మాత్రమే ఎండాకాలంలో వాడి మిగతా కాలంలో తినరు. ఎందుకంటే కీరదోసకాయ చలువ చేసి జలుబు చేస్తుందని ఉపయోగించరు. కీరదోసకాయను ఏ కాలమైనప్పటికీ అంటే చలికాలం అయినా వర్షాకాలం అయిన కాలానికి సంబంధం లేకుండా కీర దోసకాయలు తినడం మంచిది.
కీర దోసకాయలు ఎందుకు అన్ని కాలాల్లో తినాలంటే షుగర్, ఒబిసిటీ సమస్యల ఉన్నవారే కాకుండా ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండడం వలన అందరూ ఎక్కువగా తింటూ పొట్టను కీరదోసకాయలతో నింపుకుంటారు. దానికి ఒక రకంగా లాభమే. కానీ వాతావరణంలో కెమికల్ పొల్యూషన్ పెరుగుతుంది. అంతే వేడి కూడా పెరిగిపోతుంది. అతినీలలోహిత కిరణాలు మన చర్మాన్ని ఇర్రిటెడ్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వాటి నుంచి విడుదలయ్యే చర్మంలో ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి కీర దోసకాయ బాగా పనిచేస్తుంది.
కీర దోసకాయలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు 100 గ్రాముల ముక్కలు తీసుకుంటే పది క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇంతకంటే తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం మరొకటి ఉండదు. ఇందులో 96% నీరు ఉంటుంది. కానీ ఈ కీరదోస కాయలను షుగర్ ఉన్నవారు వేడి చేసిన వారు మాత్రమే తినాలి అని కాకుండా అందరూ తినాలి. మనందరం బయట ఎండకు పొల్యూషన్ కు ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి ఈ కాయలో ఉండే తక్కువ మోతాదులో ఫ్రీ రాడికల్స్ మరియు ఇతర రకాలు లేకపోయినప్పటికీ దాన్ని యూవీ రేస్ వల్ల జరిగే దాన్ని శరీరంలో వచ్చే మార్పుల వల్ల రిలీజ్ అయ్యే కొన్ని ఫ్రీ రాడికల్స్ను చక్కగా ఫ్రీ రాడికల్స్ ను రక్షించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కీరదోస కాయలను తినడం మంచిది.