Diabetes : డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినాలా…? వద్దా…?
Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తినకపోవడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా ఎన్నో కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఖర్జూర పండ్లను రోజు తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ పండ్ల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ఖర్జూరాలలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.
అలాగే ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు ఖర్జూరాలను తినేందుకు ఇష్టపడతారు. ఖర్జూరాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారిస్తాయి. ఆహారం తిన్న తర్వాత మీకు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఖర్జూరాలను తినడం మంచిది. ఇలా తినడం వలన క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. ఖర్జూరాలు ఎక్కువగా పొటాషియంతో నిండి ఉంటాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
ఈ క్రమంలో గుండె జబ్బుల నుంచి రక్షణ పొందాలంటే ప్రతి రోజు ఖర్జూరాలను తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఖర్జూరాన్ని తినవచ్చు. ఇందులో శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మూడు కంటే ఎక్కువ ఖర్జూరాలను తినకూడదని గుర్తించుకోవాలి. ఖర్జూరంలో ఎముకల నిర్మాణానికి అవసరమైన మెగ్నీషియం ఉంటుంది. అదే సమయంలో మెగ్నీషియం లోపం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలో ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది.