Bananas : బాగా పండిన అరటి పండులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని మీకు తెలుసా…!!
ప్రధానాంశాలు:
Bananas : బాగా పండిన అరటి పండులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని మీకు తెలుసా...!!
Bananas : అరటి పండ్లను ఇష్ట పడని వారంటూ ఎవరు ఉండరు. పైగా ఇవి అన్ని సీజన్ లో ఈజీగా దొరుకుతాయి. అయితే ఈ అరటిపండు అనేది బాగా పండినప్పుడు దాన్ని తినడానికి ఎవరు ఇష్టపడరు. కానీ దానిలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి అని ఎవరికి తెలియదు. కానీ దానిలో ఉన్న లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే బాగా పండిన అరటి పండులో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అలాగే ఇది శరీరానికి సరైన జీవక్రియను నిర్వహించడానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఇవి ఈజీగా కూడా జీర్ణం అవుతాయి. అలాగే జీర్ణ సమస్యలనేవి తొందరగా తగ్గిపోతాయి. అలాగే గ్యాస్ మరియు మలబద్ధకం, అసిడిటీ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది…
సాధారణ అరటి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్లలో యాంటీ యాక్సిడెంట్స్ అనేవి అధికమోతాదులో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వలన కణ నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాక అంతర్గత డ్యామేజీలు మరియు ఫ్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించేందుకు బాగా పండిన అరటిపండు సహాయపడుతుంది. అలాగే అల్సర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ అరటిపండు చాలా బాగా పనిచేస్తుంది అని అంటున్నారు. అలాగే పండినటువంటి అరటి పండులో పొటాషియం అనేది సమృద్ధిగా ఉంటుంది. అలాగే దీనిలో సోడియం నిక్షేపాలనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…
మామూలుగా పండిన అరటి పండ్ల కంటే బాగా పండిన అరటి పండ్ల లోనే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని రక్తాన్ని సరఫరా చేయటంలో హెల్ప్ చేస్తుంది. దీంతో హైబీపీ సమస్య అనేది తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. అలాగే బాగా పండిన అరటిపండును తీసుకుంటే బలం కూడా బాగా లభిస్తుంది. దీని వలన మీరు అలసిపోకుండా పని చేసుకోవచ్చు. అలాగే బాగా పండిన అరటి పండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన అనీమియా సమస్య కూడా తగ్గుతుంది. మీరు బాగా పండిన అరటి పండ్లను తీసుకోవటం వలన మీ రక్త స్థాయిలను సహజ సిద్ధంగా పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బాగా పండిన అరటి పండ్లను తీసుకోవడం వలన శక్తితో పాటుగా ఉత్సాహం కూడా వస్తుంది. దీంతో అలసట లేకుండా పని చేసుకోవచ్చు . Health benefits of eating overripe bananas