Health Benefits : డయాబెటిస్ కు ఈ ఆకులు తింటే ట్యాబ్లెట్ల అవసరం ఉండదిక.. ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్
Health Benefits : డయాబెటిస్.. ఈ రోజ్లుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. ఒకప్పుడు వృద్ధులలోనే ఈ సమస్య ఎక్కువగా చూసేవాళ్లం.. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి కారణంగా యువత, చిన్నపిల్లలనూ డయోబెటిస్ పీడిస్తోంది. ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉందని.. నాలుగు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా.అయితే ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే లైఫ్ లాంగ్ జాగ్రత్తలు పాటించాలి. ఇష్టమైన ఆహారం తినలేం.. ఎప్పటికీ మెడిసిన్ వాడుతూనే ఉండాలి. చెకప్ లంటూ ఆస్పిటల్ కు పరుగెడుతూ ఉండాలి. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
షుగర్ వ్యాధి సాధారణంగా కిడ్నీలు, కళ్లు, పేగులు, గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. డయాబెటిక్ పేషెంట్లు బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.మధుమేహం అనేది.. జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే మందులు వేసుకోకుండానే.. ఇన్సులిన్ మొక్క ఆకులతో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవచ్చని ఎన్‌సీబీఐ (NCBI) నివేదిక వెల్లడించింది.ఇందులో ప్రోటీన్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

health benefits of insulin leaf for controlling insulin level in diabetic patients
Insulin Leaves : సహజ సిద్దంగా తగ్గించుకోండిలా..
ఇన్సులిన్ ఆకులలో రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం గల రసాయనాలు ఉన్నాయి. ఇన్సులిన్ ఆకులో ప్రోటీన్, టెర్పెనాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, బి-కెరోటిన్, కొరోసోలిక్ యాసిడ్ ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇన్సులిన్ ఆకులో ఉండే..కొరోసోలిక్ యాసిడ్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడంలో బాగా పని చేస్తుంది.ప్రతి రోజూ ఇన్సులిన్ ఆకులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే దగ్గు, జలుబు, చర్మవ్యాధి, కంటి ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం, గర్భాశయ సంకోచం, విరేచనాలు, మలబద్ధకం మొదలైన వ్యాధులను తగ్గించడానికి కూడా ఇన్సులిన్ ఆకును ఉపయోగిస్తారు.