Health Benefits : ఈ ఆకు చేసే మేలు అంతా ఇంత కాదు.. వెంటనే నొప్పులన్నీ మాయం
Health Benefits : ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య కీళ్లనొప్పులు, మధుమేహం. ఆహారపు అలవాట్లు కొంత వీటిపై ప్రభావం చూపుతున్నాయి. కీళ్ల నొప్పులకు అనేక కారణాలు ఉన్నాయి. వాతం నొప్పులు, అరుగుదల నొప్పులు, పోషకాహారం లోపించడం, ఒత్తిడి వలన నొప్పులు వస్తుంటాయి. వీటి అన్నింటిని తగ్గించడానికి సహజ చిట్కాలు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.జిల్లేడు మొక్క గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. పల్లెటూళ్లలో రోడ్ల పక్కన.. బీడు భూముల్లో అధికంగా కనిపిస్తాయి. జిల్లేడు పూలు హనుమాన్ కి ప్రీతిపాత్రంగా చెబుతారు.
అలాగే వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఇరవయ్యవది. సాధారణంగా జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. వృక్షజాతిలో తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. కాగా ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు.కీళ్ల నొప్పులతో బాధపడేవారు కలబంద చెక్కు తీసుకొని లోపల ఉన్న గుజ్జుని మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి. కలబంద గుజ్జుకు చెంచా పసుపు కలిపి మెత్తని మిశ్రమంగా తయారు చేసుకోవాలి.తెల్లటి జిల్లేడు ఆకు తీసుకుని నువ్వుల నూనె రాసి వేడి చేయాలి.
Health Benefits : ఇలా చేస్తే మంచి రిలీఫ్…
ముందుగా ఎక్కడైతే కీళ్లనొప్పులు ఉంటాయో, అక్కడ కలబంద గుజ్జు, పసుపు మిశ్రమం రాసి దానిపైన వేడిచేసిన జిల్లేడు ఆకులు ఊడిపోకుండా కట్టాలి. ఇలా నైట్ టైంలో కట్టుకొని మార్నింగ్ తీసేయాలి. ఇలా రెగ్యూలర్ గా చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.అయితే మధుమేహంతో బాధపడేవారు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు కట్టుకోవాలి. జిల్లేడు ఆకు ఊడిపోకుండా దారంతో కట్టుకోవాలి. లేదంటే సాక్సులు వేసుకున్న మంచిదే. మార్నింగ్ లేవగానే తీసేయాలి. ఇలా పదిహేను రోజుల పాటు షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి రావడం గమనించవచ్చు. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి పుండ్లు, గాయాలపై రాస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి.