Health Benefits : పరిగడుపున ఈ ఒక్క పండు తింటే చాలు… ఎన్ని లాభాలో… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : పరిగడుపున ఈ ఒక్క పండు తింటే చాలు… ఎన్ని లాభాలో…

Health Benefits : కివి పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కీవీలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 ఉండడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కరోనా వచ్చాక చాలామంది రోగనిరోధక శక్తిపై శ్రద్ధ పెట్టారు. కీవీ తీసుకుంటే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ కె […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 August 2022,10:00 pm

Health Benefits : కివి పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కీవీలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 ఉండడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కరోనా వచ్చాక చాలామంది రోగనిరోధక శక్తిపై శ్రద్ధ పెట్టారు. కీవీ తీసుకుంటే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కీవీ పండ్లను తింటే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. కివి పండు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కివి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వలన గుండెపోటు, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన పొట్ట సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఉదయాన్నే పరగడుపున కివి పండ్లను తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. దీంతోపాటు మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. పోషకాలు అధికంగా కలిగిన కీవి పండ్లను తింటే శరీరంలో పోషకాల కొరతను తీరుస్తుంది. ప్రతిరోజు కీవీ పండ్లను తింటే బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో తినడం వలన ఎక్కువసేపు ఆకలి వేయదు. తద్వారా మీరు అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా నివారించవచ్చు.

Health Benefits of Kiwi fruits In Telugu

Health Benefits of Kiwi fruits In Telugu

కీవి పండ్లలో పోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉన్నందున కొంతమంది ఆరోగ్యంగా ఉండడానికి కీవి పండ్లను అధిక మోతాదులో తీసుకుంటుంటారు. కానీ అలా తినడం వలన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఇందులో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కీవీ ని ఎక్కువగా తినడం వలన కడుపునొప్పి, అలర్జీలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకే చాలామంది వైద్యనిపుణులు కీవి పండ్లను రోజుకి మూడు మాత్రమే తీసుకోవాలని సూచిస్తారు. లేదంటే ఒక గ్లాసు కీవి జ్యూస్ మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది