Health Benefits : గ్రామాలలో ఫ్రీ… నగరాలలో 10 రూపాయలు.. ఈ ఆకుకూరను తినడం వలన మూడు రకాల లాభాలు..
Health Benefits : ఆకుకూరలు అంటే తక్కువ ధరకే దొరుకుతాయి. అన్నిటికీ ధర పెరిగిన వీటికి మాత్రం ఎప్పుడు ఒకటే లాగే ఉంటుంది. ఈ ఆకుకూరలు తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే ఈ ఆకుకూరలు చిన్నపిల్లల దగ్గర నుంచి, ముసలి వారి వరకు చాలా ఈజీగా డైజేషన్ అవుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూరలలో ఒకటి పొన్నగంటి కూర, దీనికి ఇంకొక పేరు తోటి కూర అంటారు. ఇది పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతుంది. పొలాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీనిలో ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.
ఈ తోటి కూర తినడం వల్ల 77% నీరు 510 గ్రాముల క్యాల్షియం 73 కేలరీల శక్తి వస్తాయి. ఈ ఆకుకూర లో ఆల్కలిన్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది బోన్స్ దృఢంగా ఉండడానికి, బాగా ఉపయోగపడుతుంది. అన్ని కూరలతో పోలిస్తే ఈ పొనుగంటి కూరలో అధికంగా కాల్షియం ఉంటుంది. ఈ కూరను క్యాల్షియం తక్కువ ఉన్నవారు, తప్పకుండా తీసుకోవాలి. మరొక ఉపయోగం ఇది లావుగా ఉన్నవారు తినడం, వల్ల బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణ సంబంధించిన వ్యాధులని బాగా కంట్రోల్ లో ఉంచుతుంది. అంటే గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
దీనిని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటూ, ఉంటే ఈ మూడు రకాల సమస్యలు తగ్గుతాయి. ఒకటి ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం తక్కువగా ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కూర అలాగే గ్యాస్ తో చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ సమస్యలు చాలా తొందరగా తగ్గిస్తుంది. అయితే ఈ పొనుగంటి కూర పల్లెటూర్లలో ఫ్రీగా దొరుకుతుంది. అదే కూర నగరాలలో అయితే ఇది ఒక కట్ట పది రూపాయలకే దొరుకుతుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఈ కూరను అందరూ వాడుకోండి. ఆరోగ్యంగా ఉండండి.