Health Benefits : చలికాలంలో రోజుకి ఒక స్పూన్ తింటే చాలు .. ఎన్ని ఆరోగ్య లాభాలో ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : చలికాలంలో రోజుకి ఒక స్పూన్ తింటే చాలు .. ఎన్ని ఆరోగ్య లాభాలో ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :25 December 2022,7:00 am

Health Benefits : తాటి బెల్లం అనేక ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది. పంచదారతో పోలిస్తే తాటి బెల్లం లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. తాటి బెల్లం ఎటువంటి రసాయనాలు, కృత్రిమ పదార్థాలు లేకుండా తయారవుతుంది. బెల్లంతో పోలిస్తే తాటి బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మామూలు బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం రెట్టింపు ధర ఉంటుంది.తాటి బెల్లం లో తేనె, సుక్రోజ్, రెడ్యూసింగ్ చక్కెర, కొవ్వు మాంసకృతులు, కాల్షియం, ఫాస్ఫరస్, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.అందుకే అందరికీ తాటి బెల్లం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

తాటి బెల్లంలో చక్కెర కంటే 60 రెట్ల విటమిన్స్, మినిరల్స్ ఉంటాయి. తాటి బెల్లం జీర్ణ క్రియలో బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల చాలా ప్రాంతాల్లో భోజనం చేశాక చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. తాటి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన ప్రతిరోజు రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తుంది. మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాల నుండి శరీర కణాలను రక్షించడానికి సహాయపడతాయి. తాటి బెల్లం లో మిశ్రమ కార్బోహైడ్రేట్స్ ఉండడం వలన ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది.

Health Benefits of Palm jaggery

Health Benefits of Palm jaggery

తాటి బెల్లం ఎక్కువగా తింటే ఎనర్జీగా ఉంటాం. తాటి బెల్లం శ్వాస మార్గం, ప్రేగులు ఆహార పైపు, ఊపిరితిత్తులు మరియు కడుపుని శుభ్రపరిచి శరీరంలో నుండి విషాలను తొలగిస్తాయి. తాటి బెల్లం లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. తాటి బెల్లం ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. దగ్గు జలుబు మరియు ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు తాటి బెల్లం లో ఒక స్పూన్ తింటే మంచి ఫలితం ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది