Papaya leaves Juice : ఒక స్పూన్ బొప్పాయి రసంతో ఎన్ని ప్రయోజనాలో… అన్ని సమస్యలకు చెక్…!
ప్రధానాంశాలు:
Papaya Juice : ఒక స్పూన్ బొప్పాయి రసంతో ఎన్ని ప్రయోజనాలో... అన్ని సమస్యలకు చెక్...!
Papaya leaves Juice : బొప్పాయి పండు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం బొప్పాయి పండు తోనే కాకుండా బొప్పాయి ఆకులు కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అందుకే బొప్పాయి ఆకులను ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడతారు. అంతేకాక ఈ బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని తెలియజేస్తున్నారు. మరి ఈ బొప్పాయి ఆకులతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
బొప్పాయి ఆకులను జ్యూస్ చేసి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ,జ్వరాలు అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బొప్పాయి ఆకురసంలో విటమిన్ ఏ ఈ సి కె బి సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా ఇది అనారోగ్య సమస్యలు జ్వరాలు టైఫాయిడ్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది.
Papaya leaves Juice : షుగర్ నియంత్రణ…
బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన షుగర్ లెవల్ నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఈ బొప్పాయి ఆకురసం తీసుకోవడం వలన ఆ సమస్య నుంచి సులువుగా బయటపడతారు. అలాగే ఈ బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
Papaya leaves Juice జుట్టు సమస్య…
ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. అంతేకాక చుండ్రు , జుట్టులో దురద వంటి సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి జుట్టు సమస్యలతో బాధపడేవారు బొప్పాయి ఆకుల రసం తీసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు జుట్టు తెల్లబడటం సన్నగా అవడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. బొప్పాయి ఆకు రసం తీసుకోవడం వలన జుట్టు దృఢంగా మృదువుగా తయారవుతుంది.
Papaya leaves Juice క్యాన్సర్ కు నివారణ…
బొప్పాయి ఆకు లో ఫెనోలిక్ అనే కాంపౌండ్ , అల్క నాయిడ్స్ అనే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అంతేకాక క్యాన్సర్ రాకుండా కూడా బొప్పాయి ఆకులు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచడానికి ఈ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
Papaya leaves Juice కడుపుబ్బరం..
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిలో తినే ఆహారం సరిగా అరగదు. దీంతో కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఈ సమస్యకు బొప్పాయి రసం చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. అలాగే పొట్టలో , నొప్పి వంటి సమస్యలకు కూడా బొప్పాయి రసం మంచి ఔషధం. అంతేకాక మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని తగ్గించడానికి బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ బొప్పాయి ఆకుల రసం తీసుకోవాలి అనుకునేవారు ముందుగా మీ యొక్క డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.