Health Benefits : బొప్పాయి గింజలు పడేస్తున్నారా… వీటి విలువ తెలిస్తే అసలు వదిలిపెట్టరు…
Health Benefits : బొప్పాయి పండుని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. బొప్పాయి లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. భోజనం తర్వాత బొప్పాయి పండు తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. అయితే బొప్పాయిని తినేటప్పుడు అందులోని గింజలను పడేస్తారు. బొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరెందులోనూ ఉండవు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
బొప్పాయి లో పెప్సిన్ అనే పదార్థం ఉండడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బొప్పాయి పండు వలన ఉదర సంబంధిత వ్యాధులు దరిచేరవు అని నిపుణులు అంటున్నారు. బొప్పాయి పండును పండించాల్సిన వారు మాత్రమే విత్తనాలను సేకరిస్తారు. అయితే ఇవి అనేక ఇతర వ్యాధులను కూడా నయం చేస్తాయని అంటున్నారు. బొప్పాయి గింజలు నలుపు రంగులో ఉంటాయి. అనేక రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. నేరుగా తింటే చేదుగా ఉంటుంది. అందుకనే ఈ గింజలను ముందుగా ఎండలో ఎండబెట్టి తర్వాత గ్రైండ్ చేసి తీసుకోవాలి. ప్రస్తుతం గుండె డ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. రోజురోజుకీ గుండెపోటు బాధితులు ఎక్కువ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బొప్పాయి గింజలను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. ఈ విత్తనాలను తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే బొప్పాయి గింజలు గాయం నుంచి వచ్చే మంటను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఈ గింజల్లో ఆల్కలాయిడ్స్, ప్లేవనాయిడ్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో ఉండే వాపు తగ్గుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలను తొలగించడానికి బొప్పాయి గింజలు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి. అందుకనే ఈసారి బొప్పాయి తిన్నప్పుడు గింజలను కూడా తినండి.