Health Benefits : నోటిని ఉప్పు నీటితో పుక్కిలిస్తున్నారా… లేదా ఇప్పుడే అలవాటుగా మార్చుకోండి… ఎన్నో లాభాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : నోటిని ఉప్పు నీటితో పుక్కిలిస్తున్నారా… లేదా ఇప్పుడే అలవాటుగా మార్చుకోండి… ఎన్నో లాభాలు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :28 October 2022,6:40 am

Health Benefits : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పుల వల్ల ఎన్నో వ్యాధులు అందరికీ చుట్టుముడుతున్నాయి. సీజన్ లు మారుతున్న క్రమంలో ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి వ్యాధులతో చాలామంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఎన్నో వేల ఖర్చులు చేస్తూ ఉంటారు. అయినా కానీ వాటి నుంచి పెద్దగా ఉపశమనం కలగదు.. ఇలాంటి వ్యాధులు రావడానికి కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణంలోని మార్పులు ఉద్యోగరీత్యా కొన్ని టెన్షన్స్ ఒత్తిడిలు, వలన ఇలా వ్యాధులకి గురవుతూ ఉంటారు. అటువంటి వ్యాధులు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న పదార్థాలతో వాటికి చెక్ పెట్టవచ్చు.. కొన్ని సీజన్లు మారేటప్పుడు సహజంగా వర్షాలు వస్తూ ఉంటాయి. దాంతో జలుబులు, దగ్గు సమస్యలు చుట్టాల వస్తుంటాయి.

అయితే అతిగా ఇబ్బంది పెట్టి సమస్య గొంతునొప్పి దానికోసం హాస్పిటల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. మన వంటింట్లో ఉండే అధికంగా వినియోగించడం వలన ఎన్నో వ్యాధులు వస్తాయి. అన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే నిర్ణీత పరిమాణంలో వాడితే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.. ఉప్పు నీటిని గొంతులో వేసుకొని బాగా పుక్కిలించడం వలన ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు గొంతు నొప్పి ఉన్న ఉప్పు మీరు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. కేవలం గొంతు నొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఇలా చేయడం మంచిదని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. గొంతులో ఉండే బ్యాక్టీరియలు, వైరస్ లు లాంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బారి నుంచి కాపాడుతుంది. ఆసిడ్స్ లెవెల్స్ ను తటస్థంగా ఉంచుతుంది.

Health Benefits of Rinse mouth with salt water

Health Benefits of Rinse mouth with salt water

దీని ఫలితంగా పిహెచ్ లెవెల్స్ ను సమతుల్యం చేస్తుంది. ఇలా చేయడం వలన నోటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోయి నోరు దుర్వాసన లేకుండా ఉంటుంది. ఉప్పు నీటిని పుక్కలించడం వలన నోటిలో పుండ్లు, పొక్కులు, ముక్కు దిబ్బడ తగ్గుతాయి. ఇలా ఈ విధంగా నిత్యం చేస్తే అవన్నీ తగ్గిపోయి నోరు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్లు నిత్యము మూడుసార్లు ఈ ఉప్పునీటిని గొంతులో వేసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ళు నుంచి రక్తస్రావం వాపు ఉన్నవారు అలాగే పంటి నొప్పితో ఇబ్బంది పడే వారికి గొప్ప ఉపయోగాలు కలిగుతాయి. బ్యాక్టీరియాలు, వైరస్ లు గొంతులో చేరడం వలన గొంతులో ఉన్న ట్యాన్సిల్ను వాపుకి గురవుతూ ఉంటాయి. అప్పుడు ఆహారం తీసుకోవాలన్న ,ద్రవాలను తీసుకోవాలన్న చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఉప్పు నీటిని గొంతులో వేసుకొని పుక్కలించడం వలన ఈ ఇబ్బంది నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది