Sweet Potatoes : స్వీట్ పొటాటో తింటున్నారా… అది మీ గుండెను ఏం చేస్తుందో తెలుసా….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sweet Potatoes : స్వీట్ పొటాటో తింటున్నారా… అది మీ గుండెను ఏం చేస్తుందో తెలుసా….?

 Authored By ramu | The Telugu News | Updated on :26 December 2024,10:00 am

Sweet Potatoes : స్వీట్ పొటాటో లో ఉండే పోషకాలు మరి ఎటువంటి దుంపల్లో కూడా ఉండవని పోషకాహార నిపుణులు తెలిపారు. అయితే ఈ స్వీట్ పొటాటో కార్బోహైడ్రేట్స్,ప్రోటీన్స్ మంచి ఫ్యాట్స్,ఫైబర్,విటమిన్ ఏ, సి, మాంగనీస్,విటమిన్ బి6 పొటాషియం,కాపర్, నియాసిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడే దుంపల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం. స్వీట్ పొటాటో లో పిండి పదార్థంతో పాటు తీపిదనం కూడా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా చిలకడదుంపలు తినొచ్చు. ఈ రకపు స్వీట్ పొటాటోస్ గ్లూకోజుల స్థాయిలను పెంచవు. పైగా ఇవి హార్ట్ బీట్ ను కంట్రోల్ చేసే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వీటిని తినడం ద్వారా బీపీని కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

Sweet Potatoes స్వీట్ పొటాటో తింటున్నారా అది మీ గుండెను ఏం చేస్తుందో తెలుసా

Sweet Potatoes : స్వీట్ పొటాటో తింటున్నారా… అది మీ గుండెను ఏం చేస్తుందో తెలుసా….?

స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్లు కూడా ఉంటాయి. అందువల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ,అల్సర్లు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ దుంపల్ని తింటే చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య చాయలే అస్సలు దరి చేరవు. ఈ స్వీట్ పొటాటోల్ని ఎక్కువగా తినడం ద్వారా మూత్రపిండాల సమస్యలు, ఎముకల సమస్యలు, కండరాల నొప్పులు వంటివి ఏ సమస్యలు దరి చేరవు. ఈ స్వీట్ పొటాటో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్,కణాలతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. ఈ స్వీట్ పొటాటో మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిసారి తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా దరిచేరనీయవు. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంచుతాయి.

స్వీట్ పొటాటో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా నియంత్రిస్తుంది. స్వీట్ పొటాటో లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పొటాటోని తొక్కతో సహా తినాలి. తియ్యగా ఉండే ఈ దుంపలను ఉడికించుకొని కాల్చుకొని లేదా వేయించుకొని కూరను చేసుకొని కూడా తినొచ్చు. నాకే బెల్లం తో కలిపి తింటే మరీ మంచిది. బెల్లం పాకం పట్టి దీని అందులో వేసి తింటే ఇంకా మంచిది. తద్వారా ఐరన్ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది