Health Benefits : చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే… ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే… ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు…

Health Benefits : గోధుమలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసు. అలాగే గోధుమ గడ్డి కూడా అంతే మేలు చేస్తుంది. మన శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఈ గోధుమ గడ్డితో తయారుచేసిన జ్యూస్ ను తాగితే మంచి ఫలితం ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగితే రక్తం పడుతుంది. డైరెక్ట్ గా రక్తం తాగినట్లుగా శరీరంలో పడుతుందని కొందరు చెప్తుంటారు. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు మాత్రమే గోధుమ గడ్డి జ్యూస్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 July 2022,3:00 pm

Health Benefits : గోధుమలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసు. అలాగే గోధుమ గడ్డి కూడా అంతే మేలు చేస్తుంది. మన శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఈ గోధుమ గడ్డితో తయారుచేసిన జ్యూస్ ను తాగితే మంచి ఫలితం ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగితే రక్తం పడుతుంది. డైరెక్ట్ గా రక్తం తాగినట్లుగా శరీరంలో పడుతుందని కొందరు చెప్తుంటారు. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు మాత్రమే గోధుమ గడ్డి జ్యూస్ ను త్రాగాలి. ఈ జ్యూస్ తాగడం వలన ఆరోగ్యపరంగా మరొక ప్రయోజనం కూడా ఉంది. అది ఏంటంటే ఈ గోధుమ గడ్డి జ్యూస్ శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ గోధుమ గడ్డి జ్యూస్ తో కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ గడ్డి జ్యూస్ ను 15 రోజులు తాగితే శరీరానికి రక్తం సరిపడా అందుతుంది. అలాగే 15 రోజులు పాటు త్రాగినట్లయితే 30% వరకు శరీరంలోని ఎల్డీఎల్ అనే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అలాగే ఈ జ్యూస్ ని కనుక రెండు నెలలపాటు తాగితే శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగితే శరీరంలో రక్తం పెరుగుతూనే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మన బాడీలో కొలెస్ట్రాల్ 200 లోపు ఉండాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే రెండు నెలలపాటు ఈ జ్యూస్ ను తాగితే కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా గోధుమ గడ్డి వలన శరీరంలో రక్తం పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం, బీపీ కూడా తగ్గుతుంది. అలాగే డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.

Health Benefits of wheat grass juice for bad cholesterol

Health Benefits of wheat grass juice for bad cholesterol

గోధుమ గడ్డి జ్యూస్ వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఈమధ్యనే శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ జ్యూస్ శరీరానికి బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. కొలస్ట్రాలు విషయంలో గోధుమ గడ్డిని ఉపయోగించడం వలన ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా తగ్గిందని చెబుతున్నారు. గోధుమ గడ్డి మార్కెట్లో దొరుకుతుంది. కనుక ఇలాంటి గోధుమ గడ్డిని మీరు కూడా ఇంటికి తెచ్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ గడ్డిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అలా వీలు కాకపోతే బయటినుంచి డెలివరీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గోధుమ గడ్డినిఅరకేజీ లేదా కేజీ ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే నాలుగు నుంచి పది రోజులు దాకా సరిపోతుంది. ప్రతిరోజు 100 నుంచి 150 మిల్లీ లీటర్ల జ్యూస్ ను తాగితే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది