Health Benefits : ఈ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాల గని.. దీనిని ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగుతుంటారు..!!
Health Benefits : మన శరీర అవయవాలు సక్రమంగా పనిచేయాలి అంటే మన శరీరంలో రక్తం సరిగా ఉండాలి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. రక్తం లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
శరీరంలో రక్త లోపం తగ్గాలంటే గోధుమ గడ్డి జ్యూస్ తాగితే చాలు.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అమెరికాలో దీనిని విరివిగా వాడుతుంటారు. అక్కడ అన్ని స్టోరీలో ఇది దొరుకుతుంది. చాలామంది దీన్ని జ్యూస్లా తీసుకుంటారు. దీనిని పౌడర్ రూపంలో టాబ్లెట్లు రూపంలో కూడా అమ్ముతూ ఉంటారు.అయితే ఈ గోధుమ గడ్డి జ్యూస్ లా తాగితేనే చాలా ఉపయోగాలు పొందవచ్చు
అని నిపుణులు తెలుపుతున్నారు. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… అధిక బరువు తగ్గుతారు; గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వలన జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనిలోని క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. వీట్ గ్రాస్ జ్యూస్ చక్కర కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు పట్లా కోరికను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.. ఔషధాల గని: విటమిన్ ఏ బి కాంప్లెక్స్ సి ఈ కే విటమిన్లతో పాటు క్యాల్షియం ఐరన్ ,మెగ్నీషియం, న్యూట్రిమెంట్, యాసిడ్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఆంటీ యాక్సిడెంట్ లు ఉంటాయి. ఇది మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.
శరీరంలోని మలినాలను టాక్సీన్లను తొలగిస్తాయి. జీవన వ్యవస్థ మెరుగుపడుతుంది: గోధుమ గడ్డిలో ఎంజైన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోషకాలను గ్రహించడానికి ఇవి ఉపయోగపడతాయి. 2011లో జరిగిన ఓ పరిశోధన ప్రకారం గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు ప్రేగులను శుభ్రపరుస్తున్నాయి. గ్యాస్, కడుపుబ్బరం ,అజీర్తి లాంటి సమస్యలు దూరం అవుతాయి వీట్ గ్రాస్ మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.. ఇన్ఫెక్షన్లకు చెక్: గోధుమ గడ్డిలోని క్లోరోఫిల్ శరీరంలోని విషపదార్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలిన గాయాలను తగ్గిస్తుంది. దానికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా రక్షిస్తుంది. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది..