Yoga : యోగాలో ఈ ఆసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో… ముఖ్యంగా అలాంటి వారికి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Yoga : యోగాలో ఈ ఆసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో… ముఖ్యంగా అలాంటి వారికి…!

Yoga  : ఒకప్పుడు యోగాసనాలకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. అప్పట్లో చాలామంది ఈ యోగాసనాల ద్వారా వారి ఆరోగ్యాలను పదిలంగా కాపాడుకునేవారు. ఆ తర్వాత రాను రాను యోగాసనాలపై ప్రజల్లో ఆదరణ పూర్తిగా పోయింది. కాని ప్రస్తుతం యోగాకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి. అంతేకాక ఆరోగ్య నిపుణులు సైతం పదేపదే ఆసనాలు చేయడం వలన శారీరక ,మానసిక రుగ్మతల నుండి ఉపశమనం పొందుతారని చెప్పడంతో చాలామంది యోగాసనాలపై శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఈ యోగాసనాలలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Yoga : యోగాలో ఈ ఆసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో... ముఖ్యంగా అలాంటి వారికి...!

Yoga  : ఒకప్పుడు యోగాసనాలకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. అప్పట్లో చాలామంది ఈ యోగాసనాల ద్వారా వారి ఆరోగ్యాలను పదిలంగా కాపాడుకునేవారు. ఆ తర్వాత రాను రాను యోగాసనాలపై ప్రజల్లో ఆదరణ పూర్తిగా పోయింది. కాని ప్రస్తుతం యోగాకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి. అంతేకాక ఆరోగ్య నిపుణులు సైతం పదేపదే ఆసనాలు చేయడం వలన శారీరక ,మానసిక రుగ్మతల నుండి ఉపశమనం పొందుతారని చెప్పడంతో చాలామంది యోగాసనాలపై శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఈ యోగాసనాలలో కరణి ఆసనం వేయడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఇంగ్లీషులో వాల్ ఫోజ్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారట. మరి ఈ కరణి ఆసనం ఎలా చేయాలి…కావున ఈ కరణి ఆసనం ఎలా చేయాలి? దీనివలన కలిగే ప్రయోజనాలు ఏంటి..! ఇప్పుడు మనం తెలుసుకుందాం…….

Yoga  : జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది…

ప్రతిరోజు ఉదయం ఈ కరణి ఆసనం చేయడం వలన మలబద్ధకం, కడుపునొప్పి జీర్ణవ్యవస్థ ,ఆపనవాయువు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు ఈ కరణి ఆసనం వేయడం వలన మంచి ప్రయోజనాలు పొందుతారు.

Yoga  : నిద్రలేమి…

కరణి ఆసనాన్ని స్లీపింగ్ పొజిషన్ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ ఆసనాన్ని ప్రతిరోజు వేయడం వలనఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. తద్వారా ఆందోళన, నిద్రలేమి వంట సమస్యల నుంచి బయటపడవచ్చు.

Yoga  : కండరాల నొప్పి…

ఈ కరణి ఆసనం వేసి ప్రతిరోజు 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం వలన మీ కండరాలు విశ్రాంతి పొందుతాయి. తద్వారా పాదాలు మరియు అరికాళ్ళలో నొప్పి సులువుగా తగ్గిపోతుంది.

Yoga యోగాలో ఈ ఆసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో ముఖ్యంగా అలాంటి వారికి

Yoga : యోగాలో ఈ ఆసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో… ముఖ్యంగా అలాంటి వారికి…!

Yoga  : రక్తప్రసరణ మెరుగుపరచడానికి…

ప్రతిరోజు ఈ కరణి ఆసనం వేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాక ఈ ఆసనం ప్రతిరోజూ చేయడం వలన కాళ్లలో వాపు జలదరింపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తప్రసరణ సరిగ్గా జరగడానికి ఈ ఆసనం ఎంతగానో తోడ్పడుతుంది..

Yoga  : ఆసనం ఎలా చేయాలంటే…

ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ ఆసనాన్ని చాలా సులువుగా చేయవచ్చు. దీనికోసం ముందుగా మీరు ఒక గోడ దగ్గర పడుకుని మీ కాళ్ళను గోడకు సమానంగా చాపాలి. కాళ్లు పైకి తల కిందకు ఉండి నడుము గోడకు సమానంగా ఉండేలా ఈ ఆసనం చేయాల్సి ఉంటుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది