Health Benefits : ఈ పండు ఒక్కటి తింటే చాలు.. మీ షుగర్ లెవల్స్ ఇక మీ చేతిలోనే..
Health Benefits : ఆవకాడో పండ్లు ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. విదేశాలలో ఎక్కువగా సాగవుతున్న ఈ పండ్లు ప్రస్తుతం అన్ని చోట్లా లభిస్తున్నాయి. అవకాడోలో పోషకాలు సమృద్ధిగా, ఏ, బీ, ఇ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవకాడో అనేది కొవ్వు కలిగిన పండ్లలో ఒకటి అందుకే దీన్ని వెన్న పండు అని కూడా అంటారు. దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు సాండ్ వీచ్, సలాడ్లలో ఎక్కువగా వాడతారు.అవకాడోలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.
అంతేకాక, క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్త పీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలున్నాయి. అందువల్లే, దీన్ని డార్క్ చాక్లెట్, కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం, 28 గ్రాముల అవకాడో పండ్లలో ఒక జౌన్స్ ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి.ప్రధానంగా అవకాడోలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెంట్స్, డయాబెటిక్ పేషంట్స్ లో రక్తంలో చక్కర స్థాయిలను మెరుగుపరిచే మోనోసాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి.
Health Benefits : చక్కెర స్ఠాయిలను అదుపులో ఉంచుతుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దం చేయడానికి మరియు ఇన్సులిన్ స్థాయిలని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, అవకాడోలలో ఉండే ఫైబర్ నిక్షేపాలు రక్తంలో చక్కర నిల్వలు పెరగకుండా చేస్తాయిలింఫోసైట్స్, కీమోథెరపీ మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. అవకాడో సారం ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అవకాడోని తీసుకోవడం వల్ల చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కెరోటినాయిడ్స్, విటమిన్ సీ, విటమిన్ ఈ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అవకాడో కలిగి ఉంది.