Diabetes : డయాబెటిస్ లక్షణాలు ఎలా గుర్తించాలంటే.. ఈ రేంజ్ దాటితే ప్రమాదమే..
Diabetes : మారుతున్న జీవన శైలీకి అనుగుణంగా సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, అలసట, ఒత్తిడి, అధిక పనిగంటలు, వంశపారంపర్యంగా ఉంటే కూడా ఈ వ్యాధి వస్తుంది. పనిలో పడి చాలా మంది వ్యాయమాన్ని మర్చిపోతున్నారు. ఎక్కువగా ఆఫీసుల్లో కూర్చోవడం వల్ల కూడా అధిక బరువు పెరిగి డయాబెటిస్ కి దారితీస్తుంది. జంక్ ఫుడ్, టైమ్ కి తినకపోవడం వంటివి తోడై సమస్య మరింత పెరుగుతోంది.ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50.37 కోట్ల మంది డయాబెటిస్ సమస్య తో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ తాజా గణాంకాల్లో వెల్లడించింది.
మనదేశంలో ఇప్పటికే 7.7 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అలాగే 25 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లలో కూడా ఈ సమస్య అధికంగా ఉందని చెబుతున్నారు. డయాబెటిస్ లక్షణాలు కూడా ఇప్పడు తెలుసుకుందాం…ఎక్కువగా దాహం వేయడం, రాత్రిళ్లు ముత్రవిసర్జన సమస్య ఎక్కువగా ఉండటం, విపరీతమైన అలసట, చిరాకు. బరువు తగ్గటం, గాయాలు మనకపోవడం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి. అయితే బయాబెటిస్ సమస్య తీవ్రమైతే ఇతర అవయవాలపై ప్రభావం చూపి సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.
Diabetes : గ్లూకోజ్ స్థాయిలు ఎంత ఉండాలి..
ఉదయాన్నే ఎలాంటి ఆహారం తీసుకోకముందు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ 70 నుంచి 100 ఉంటే సాధారణ స్థాయిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. 100 నుంచి 125 కు చేరితే ఫ్రీ డయాబెటిస్ అని.. 126 కు పైగా షుగర్ లెవల్స్ ఉంటే డయాబెటిస్ ఉన్నట్లుగా గుర్తించాలని తెలిపింది. అయితే కేవలం మందులు వేసుకుంటే సరిపోదని, ఆహారపు అలవాలట్లను కూడా మార్చుకోవాలని, డైట్ మెయింటైన్ చేస్తూ రెగ్యూలర్ గా శారీరక వ్యయామం తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలని, మొలకెత్తిన గింజలను కూడా రెగ్యూలర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.