Health Benefits : ఈ జ్యూస్‌ కలిగే షుగ‌ర్ లెవ‌ల్స్ ఎంతున్నా త‌గ్గాల్సిందే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ జ్యూస్‌ కలిగే షుగ‌ర్ లెవ‌ల్స్ ఎంతున్నా త‌గ్గాల్సిందే..

 Authored By mallesh | The Telugu News | Updated on :25 March 2022,2:00 pm

Health Benefits : నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చల్లని, రిఫ్రెష్ రుచిని అందిస్తాయి. అందుకే దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని డైరెక్ట్ గా కానీ సలాడ్, పెరుగు, మజ్జిగలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.కీరదోస విత్తనాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఖనిజ లవణాలు సైతం దీనిలో ఉంటాయి. కీరదోస ప్రతి భాగంలో పోషకాలతో నిండి ఉంటుంది. గింజలు, తొక్కలోనూ ఇవి అధికంగా ఉంటాయి.

అలాగే కాలరీలతో పాటుగా కార్భోహైడ్రేట్స్, సోడియం, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. కీరదోసలో విటమిన్ సీ, విటమిన్ కే, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. కాబట్టి కీరదోసను ఆహారంగా తీసుకుంటే.. ఇవన్నీ మన శరీరానికి లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైంది ఏమిటంటే కీరదోసలో పిండి పదార్ధాలు తక్కువగా ఉంటాయి, అందుకే ఇది డయాబెటిస్ డైట్ ‌లో భాగం కావడానికి ప్రధాన కారణం.కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. డయాబెటిస్ ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. కీరదోసలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ స‌క్ర‌మంగా జరిగేలా సహకరిస్తాయి.

diabetes and weight loss Health Benefits in Cucumber

diabetes and weight loss Health Benefits in Cucumber

Health Benefits : షుగ‌ర్ కంట్రోల్ లో ఉంట‌ది

కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉన్నాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి. కీరదోసలో కాన్సర్ ను నిరోధించే గుణాలు సైతం ఉన్నాయి.డయాబెటిస్ డైట్‌ లో ముఖ్యమైన ఆహారాలలో కీరదోసకాయ ఒకటి. దోసకాయలో ఎక్కువగా నీరు, తక్కువ శాతం కేలరీలు ఉంటాయి. అదేవిధంగా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కీరదోస కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను, చక్కెరను తగ్గిస్తుంది. ఈ కారణంగా రక్తంలో చక్కెర ద్వారా వచ్చే సమస్యలను నివారిస్తుంది. బీటాకెరొటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కంటి, చర్మ ఆరోగ్యాన్ని సైతం పరిరక్షిస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది