Health Benefits : ఉదయాన్నే వీటిని తిన్నారంటే… బాడీలో కొవ్వు ఇట్టే కరిగిపోద్ది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఉదయాన్నే వీటిని తిన్నారంటే… బాడీలో కొవ్వు ఇట్టే కరిగిపోద్ది…

 Authored By aruna | The Telugu News | Updated on :7 September 2022,7:30 am

Health Benefits : ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇలా పేరుకుపోవడం వలన రక్తనాళాలు ఇరుకుగా అయిపోయి శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల పలు వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు కొలెస్ట్రాల్ రక్తంలోని ధమనులలో పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. అయితే వైద్యుల సలహాతో కొన్ని చిట్కాలను పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే పరిగడుపున కొన్ని ఆహారాలను తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, రెండు నాలుగు బాదం గింజలు, 8 ,10 ఎండు ద్రాక్షలు, అర గిన్నె ఓట్స్ తో ప్రతిరోజు రాత్రి నానబెట్టి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తినాలి. వీటిని రోజు తినడం వలన రక్తనాళాల్లో ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో ట్రై గ్లిజరైడ్ సాయి లను తగ్గిస్తాయి. ఎండు ద్రాక్షలు కొలెస్ట్రాల్ ను నియత్రించే ఫైటోకెమికల్స్, ప్లేవనాయిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే బాదంపప్పులో విటమిన్ ఇ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

Health Benefits These foods reduce the bad cholesterol in our body

Health Benefits These foods reduce the bad cholesterol in our body

ఇవి కొలెస్ట్రాల్ ను కరిగించడంలో బాగా పనిచేస్తాయి. పొద్దు తిరుగుడు గింజల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆహారంలో సోయాబీన్స్ కు బదులుగా సన్ఫ్లవర్ నూనెను ఉపయోగించడం మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాలను పెంచుతాయి. అలాగే ట్రై గ్లిజరైడ్ చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. దీంతో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఇందులో పోలిక్ యాసిడ్,రైబోఫ్లెవిన్ వంటి పోషకాలు ఐరన్, కాల్షియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది