Health Problems : ఈ తప్పులు చేస్తే మీరు బరువు పెరిగిపోవడం ఖాయం
Health Problems: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. చాలా మంది తమకు తెలియకుండానే బరువు పెరిగిపోతున్నామని భ్రమ పడుతుంటారు. కానీ వాళ్లు చేసే తప్పులను మరిచిపోతారు. తెలియక చేసే తప్పుల వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలా బరువు పెరగడం కారణంగా డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు.రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం కారణంగా చాలా మంది బరువు పెరిగిపోతుంటారు. ఎక్కువగా నైట్ షిఫ్టులు చేసే వాళ్లు కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత ఈజీగా బరువు పెరుగుతారు. నిద్ర సరిపడా లేకపోవడం కారణంగా ఆహారం ఎక్కువగా తింటారు. దీంతో తెలియకుండానే విపరీతంగా బరువు పెరిగి ఇబ్బంది పడుతుంటారు.
ఈరోజుల్లో యువత రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోవడంలేదని.. అందుకే 20 ఏళ్లకే అధిక బరువుతో బాధపడుతున్నారని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.ప్రస్తుతం యువత ఇంట్లో ఆహారం కంటే బయట ఆహారం తినడానికే ఇష్టపడుతున్నారు. ఫలితంగా రెస్టారెంట్లు, హోటళ్లు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. రెస్టారెంట్లలో తయారుచేసే ఆహారంలో అధిక ఉప్పు, ఇతర మసాలాలు ఎక్కువగా వాడటంతో వాటిని తింటే శరీరంలో గ్యాస్ ట్రబుల్ ఏర్పడి యువత తమకు తెలియకుండానే బరువు పెరిగిపోతున్నారు.అధికంగా కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు కూడా అధిక బరువుకు కారణం అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా దాహం అవుతుందని వేసవి కాలంలో తాగే కూల్‌డ్రింక్స్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతుంది. కూల్‌డ్రింక్స్‌లో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. ఇవి అధిక బరువుకు కారణం అవుతాయి.అదేపనిగా కూర్చోవడం కారణంగా కూడా బరువు పెరుగుతారు. ప్రస్తుతం ఆఫీసుల్లో చాలామంది గంటల తరబడి కూర్చుని పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. మధ్యలో లేచి అటు ఇటు తిరగడానికి కూడా తమకు సమయం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇలా కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కేలరీలు ఖర్చుకాకపోవడంతో బరువు పెరిగిపోతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా గంటకు ఒకసారి అయినా లేచి రెండు నిమిషాల పాటు అటు ఇటు తిరుగుతుండాలని వాళ్లు సూచిస్తున్నారు.