Health Problems : మనిషి శరీరం నుండి వచ్చే వాసన ద్వారానే… ప్రాణాంతక దోమలు కుడుతాయట.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Problems : మనిషి శరీరం నుండి వచ్చే వాసన ద్వారానే… ప్రాణాంతక దోమలు కుడుతాయట..

 Authored By aruna | The Telugu News | Updated on :25 September 2022,7:30 am

Health Problems : ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ప్రధాన సమస్య దోమలు. ఇక వర్షాకాలంలోనూ అయితే చెప్పనక్కర్లేదు. ఎక్కడపడితే అక్కడ కుడుతూ, చెవి దగ్గర అవి చేసే గోల మామూలుగా ఉండదు. ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు. అలాగే దోమలతో వచ్చే రోగాలు అన్ని ఇన్ని కావు. కొన్ని ప్రదేశాలలో అయితే ఈగ సైజులో ఉండే దోమలు కూడా జనాల్ని వేధిస్తూ ఉంటాయి. దోమ కరవడం వలన డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. దీంతో ప్రజలు తరచూ హాస్పిటల్ పాలవుతుంటారు. ఇంకా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులకు కారణం దోమలు. దోమ కుట్టడం వలన ఇలాంటి వ్యాధులు వస్తాయి.

అయితే దీనికి కారణం మనిషి శరీరం నుంచి వచ్చే సువాసన అంటున్నారు పరిశోధకులు. వ్యాధులను వ్యాపించే దోమలు కుడుతున్నాయి అంటే దానికి ఒక కారణం ఉందంట. అది మీ శరీరం నుంచి వచ్చే వాసన అనేక వ్యాధులను వ్యాపించే దోమలను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. చర్మం నుంచి వచ్చే సువాసనలు ఎట్రాక్ట్ చేస్తాయని అంటున్నారు. జికా, డెంగ్యూ, యల్లో ఫీవర్ వైరస్ల వాహకాలుగా పనిచేసే దోమలను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. చర్మం నుంచి వచ్చే వాసన ఆ వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను ఆకర్షిస్తాయట. యూసీ రివర్ సైడ్ పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Health Problems In these skin fragrance attracts harmful mosquitoes

Health Problems In these skin fragrance attracts harmful mosquitoes

బాధితుడు నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్, 2 కెటోగ్లుటారిక్, లాక్టిక్ ఆమ్లాల సమ్మేళనాల వాసన ద్వారా దోమలు ఆ వ్యక్తులను కుడతాయంట. పరిశోధనల ప్రకారం దోమలు గుర్తించడానికి అది వ్యక్తిపై దాడి చేయడానికి ప్రేరేపించే వాసన కార్బన్డయాక్సైడ్ మరియు 2 కెటోగ్లుటారిక్ మరియు లాక్టిక్ ఆమ్లాల సమ్మేళనాల మిశ్రమం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయర సమ్మేళనం ప్రోబింగ్ ని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ రసాయన సమ్మేళనం ఆడ ఈడీస్ దోమల్లో ఎక్కువగా కనుగొన్నారు. ఇది జికా, చికెన్ గునియా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వైరస్ల వాహకాలుగా కనిపిస్తుంది. ఈ ఆడ ఈడిస్ ఈజిప్ట్ దోమలను మొదట ఆఫ్రికాలో కనుగొన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది