Health Problems : రాత్రి సమయంలో ఇటువంటి ఆహారం తింటున్నారా.? మీరు డేంజర్ లో ఉన్నట్లే…
Health Problems : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి లో ఆహారం తీసుకునే విధానంలో కొన్ని మార్పులు వలన ఎన్నో వ్యాధులు చుట్టూ ముట్టుతున్నాయి. ప్రధానంగా ఆహారం తీసుకునే పద్ధతి వలనే ఎక్కువగా వ్యాధులు సంభవిస్తున్నాయి. కాబట్టి దీనిపై దృష్టి ఉంచాలి. మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం… రాత్రి పడుకునే సమయంలో చాలామంది వాళ్ళ ఇష్టానుసారం తినేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టమోటాలు: ఈ టమాటాలు రాత్రి పడుకునే ముందు ఆహారంగా తీసుకున్నట్లయితే దీనిలో ఉన్న యసిడ్ రిప్లక్స్ జరుగుతుంది. అందుకే నిద్రకు భంగం కలుగుతుంది. అదేవిధంగా కొంతమంది రాత్రి భోజనం తర్వాత కొన్ని రకాల జ్యూస్లను తాగుతూ ఉంటారు. ఈ జ్యూస్లలో కొన్ని రకాల ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు మన శరీరంలో ప్రతి చర్యను కలిగించి నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే కొంతమంది రాత్రి సమయంలో మద్యం అలాగే కొన్ని కూల్డ్రింక్స్ ను త్రాగుతూ ఉంటారు. వీటి వలన కూడా నిద్రకు భంగం కలిగి అవకాశం ఉంటుంది.
పెయిన్ కిల్లర్స్, చాక్లెట్స్ రాత్రి సమయంలో ఈ పెయిన్ కిల్లర్స్, చాక్లెట్లను తీసుకోకూడదు. వీటిలో కెపిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నిద్రను ప్రభావితం చేసి, నిద్ర కు భంగం కలిగేలా చేస్తుంది. ఉల్లిపాయ: ఈ ఉల్లిపాయను రాత్రి సమయంలో ఆహారంలో తీసుకున్నట్లయితే.. జీర్ణవ్యవస్థపై ఈ ఉల్లిపాయ ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ ఉల్లిపాయ వలన కడుపులో ఎక్కువ మొత్తంలో గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే నిద్రకు భంగం కలుగుతుంది. ఇవన్నీ నిద్రకు, జీర్ణవ్యవస్థకు భంగం కలిగిస్తూ ఉంటాయి కాబట్టి రాత్రి సమయంలో వీటికి దూరంగా ఉండడం మంచిది.