Health Tips : జలుబు, దగ్గు, ఊపిరితిత్తులు మరియు గొంతులోని స్లేష్మం పూర్తిగా తొలగిపోతుంది…!!
Health Tips ; సీజన్ మారుతున్న సమయంలో చాలామందికి జలుబు, దగ్గు గొంతులు ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.. కొంతమందికి అయితే ఇవి ఎప్పుడు ఉంటాయి. అలాంటివారు ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడి కూడా ఇసిగిపోయి ఉంటారు. అలాంటివారు కి ఇప్పుడు మన ఇంట్లో ఇంగ్రిడియంట్స్ తోని ఓ చక్కని డ్రింక్ తయారు చేయబోతున్నాము.. ఈ డ్రింక్ తాగారంటే ఇక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు.. ఇప్పుడు మనం చేసుకోబోయే రెమిడి జామ ఆకులతో ఈ జామ చెట్టు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. దీని పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే దీని ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
దీంతో ఇప్పుడు మనం ఒక డ్రింక్ ని తయారు చేయబోతున్నాం..దీనితో చాలా న్యాచురల్ గా మనకు బాడీలో నుంచి కఫం అనేది బయటికి రావటం అనేది జరుగుతుంది. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మీకు కావాల్సింది జామాకులు. ఈ జామఆకులు కొన్ని ఒక రెండు ఆకులు తెంపి ముక్కలుగా కట్ చేసుకుని వాటిని శుభ్రంగా కడిగి స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి దానిలో ఆఫ్ లీటర్ వాటర్ వేసి ఈ ముక్కలను అందులో వేసి బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో నాలుగు లవంగాలు, రెండు యాలకులు వేసి బాగా మరిగించాలి.
తరువాత కొంచెం అల్లం ముక్కలను దంచి వేయాలి.. ఆ వాటర్ కొంచెం దగ్గరకు అయిన తర్వాత స్టైనర్ సహాయంతో వడకట్టుకుని ఒక కప్పులో వాటిని పోసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉండగానే నెమ్మది నెమ్మదిగా త్రాగుతూ ఉండాలి.. ఈ విధంగా ప్రతిరోజు తాగినట్లయితే జలుబు, దగ్గు, ఊపిరితిత్తులలో స్లేష్మం పూర్తిగా తొలగిపోతుంది. సీజనల్ వ్యాధుల నుంచి కూడా బయటపడతారు.. చాలామంది డస్ట్ అలర్జీతోబాధపడుతూ ఉంటారు. వారు కూడా ఈ డ్రింక్ ట్రై చేసినట్లయితే మంచి ఉపశమనం లభిస్తుంది…