Health Tips : బీపి నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : బీపి నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలి…?

 Authored By aruna | The Telugu News | Updated on :1 September 2022,5:00 pm

Health Tips : మనిషికి సాధారణ రక్తపోటు 120/80 mmHg వరకు ఉంటుంది. 140/90 కంటే ఎక్కువ రక్తపోటు ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. అధిక రక్తపోటు రావడానికి కారణం పనిలో ఒత్తిడి జీవన శైలిలో వచ్చే మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన వస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో నొప్పి, తలనొప్పి, కంటి చూపు తగ్గడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోకపోతే మెదడు దెబ్బతినడం, పక్షవాతం, మెదడు రక్తస్రావం, గుండె, మూత్రపిండాలు, కళ్ళు దెబ్బతింటాయి. హైపర్ టెన్షన్ ఎమర్జెన్సీలో రోగి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.

హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటే హఠాత్తుగా హై బీపీ పెరిగితే వేగంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి. తగ్గించుకోకపోతే శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. బిపి పరిస్థితిని నియంత్రించడానికి బీపీ ఒక నిమిషం నుంచి గంటలు 25 శాతం తగ్గించాలి. బీపీ ని నియంత్రించడానికి మీరు తీసుకునే ఆహార పదార్థాలను మార్చుకొవాలి. అలాగే జీవన శైలిలో కొన్ని మార్పులను తీసుకురావాలి. బిపిని నియంత్రించడంలో సీజనల్ పండ్లు, కూరగాయలు ప్రభావంతంగా పనిచేస్తాయి. రక్త పోటును అదుపులో ఉంచాలంటే సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు కచ్చితంగా తినాలి. రోజు ఒక యాపిల్ పండు తింటే రక్తపోటు సాధారణంగా ఉంటుంది. అలాగే ఉసిరి రక్తపోటును నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Health Tips for control High Blood Pressure In Telugu

Health Tips for control High Blood Pressure In Telugu

అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పరగడుపున జామకాయ రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి రసంలో తేనెను కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే విటమిన్ సి ఉన్నటువంటి పండ్లను ఎక్కువగా తినాలి. ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలతో సహా అన్ని సిట్రస్ లు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రణ ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే ఈ పండ్లన్ని బిపిని నియంత్రిస్తాయి. అలాగే బ్రోకోలిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. బ్రోకలీని సలాడ్ గా లేదా కర్రీ చేసుకొని తింటే బిపి నియంత్రణలో ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది