Health Tips : సీజనల్ వ్యాధుల నివారణ కోసం మిల్క్ టీ బదులుగా కొన్ని రకాల హెర్బల్ టీలు బెస్ట్ టిప్స్.!!
Health Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది జలుబులు, జ్వరాలు, ప్లు లు ఇలా ఎన్నో రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటారు. ఈ వర్షాకాలంలో జలుబు వచ్చిందంటే తొందరగా ఉపశమనం కలగదు. అలాంటి టైంలో ఎక్కువగా ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. మనం ఇంట్లోనే న్యాచురల్ గా హెర్బల్ టీ లనుని తయారుచేసుకొని తాగవచ్చు. ఇవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అల్లం టీ వర్షాకాలంలో అల్లం టీ త్రాగడం వలన జలుబులు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా సహాయపడుతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పొందవచ్చు.
అలాగే బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా మెరుగుపడుతుంది. గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ మన శరీరంలో మెట్టబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అధిక బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే అంటువ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చామంతి టీ ఈ టీ నిద్రలేని సమస్యతో బాధపడే వారికి ఈ చామంతి టీ చాలా మంచి ఉపయోగకారి.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫీవర్స్ అలాగే వైరల్ ఫీవర్స్, జలుబులు ఇన్ఫెక్షన్లు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. తులసి టీ ఈ తులసి టీ కి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ తులసి ప్రీతికరమైనది. హిందూ మతంలో ఈ తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ తులసి టీ ఎన్నో వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీనిని త్రాగడం వలన జలుబు, దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.