Health Tips : మీరు పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ చిట్కాని పాటించి చూడండి… ఇక శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : మీరు పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ చిట్కాని పాటించి చూడండి… ఇక శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు…

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2022,5:00 pm

Health Tips : ఎంతోమంది పులిపిర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి ముఖముపై అలాగే శరీరంపై రకరకాల చోట్లలో ఫిలిపిర్లు వస్తూ ఉంటాయి. ఈ పులిపిరులను ఇంగ్లీషులో వార్ట్స్ అని పిలుస్తారు. ఈ పులిపర్లు రావడానికి కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ అని కారణంగా మన శరీరంపై ఈ పులిపర్లు లు వస్తుంటాయి. అయితే ఇది మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పులిపర్లు లో కొన్ని రకాల పులిపిర్లు కూడా ఉంటాయి. ఈ పులిపిర్ల వల్ల ఎటువంటి నొప్పి అనేది ఉండదు. కానీ ఇవి కొన్నిచోట్ల చూడడానికి చాలా అంద వికారంగా ఉంటాయి. అయితే వీటిని తొలగించే క్రమంలో ఎన్నో క్రీములను అలాగే కట్ చేయడము ఇలా ఎన్నో రకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ పులిపిర్లను లను న్యాచురల్ గా ఇంట్లోనే తొలగించి పద్ధతి ఒకటి ఇప్పుడు చూద్దాం.

దీనికోసం మొదటగా ఒక పాత్ర తీసుకొని దానిలో ఒక స్పూను ఆముదం, అర స్పూను కోల్గేట్ టూత్ పేస్ట్ అలాగే అర స్పూన్ వంటసోడాను వేసి ఈ మూడింటిని బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నైట్ టైంలో పులిపిర్ల మీద అప్లై చేసుకోవాలి. నైట్ మొత్తం అలాగే ఉంచుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు రాస్తూ ఉండడం వలన చిన్నగా ఉన్న పులిపిర్లు నాలుగు నుండి ఏడు రోజుల సమయంలో వాటంతట అవే రాలిపోతూ ఉంటాయి. అయితే పెద్దగా ఉన్న పులిపిర్లుకు మాత్రం మూడు వారాల సమయం పడుతుంది.

Health Tips for warts Use tip to your skin

Health Tips for warts Use tip to your skin

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ పులిపర్లు 7 రోజులలో రాలిపోతాయి. అయితే ఈ మిశ్రమం కొందరి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారికి కొంచెం నొప్పిని కలగజేస్తుంది. అలాగే ఈ పులిపిర్లులకు నివారణకు మరొక చిట్కా తెలుసుకుందాం. దీనికోసం ఒక తమలపాకును తీసుకొని దానికి ఉన్న కాడను వేరుచేసి ఆ కాడతో తడి సున్నాన్ని తీసుకుని పులిపిర్లపై పెట్టాలి. పెట్టిన తర్వాత అదే కాడతో పులిపిర్లపై మసాజ్ చేయాలి. ఇలా ప్రతిరోజు చేసినట్లయితే నాలుగు రోజులలో మీ పులిపిర్లు వాటి అంతట అవే రాలిపోతాయి. ఈ మిశ్రమం వాడటం వలన ఎటువంటి నొప్పి ఉండదు. చాలా సులభంగా పులిపిర్లు రాలిపోతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది