Health Tips : మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయా.. అయితే డేంజర్ లో ఉన్నట్లే
Health Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలిలో ఎన్నో మార్పుల కారణంగా ఎన్నో వ్యాధుల బారిన పడిపోతున్నారు. మనిషి జీవిస్తున్న విధానంలో కొన్ని మార్పులు వలన ముఖ్యంగా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ అనే వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. అదేవిధంగా ఆకస్మిక మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలలో ఇలాంటి వ్యాధుల బారిన పడిన వారు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు కి ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయి. వీటికి కారణాలు మనిషి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పడకపోవడం, అలాగే తను చేసే ఉద్యోగ రిత్యా క్రమంలో తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. సరియైన నిద్ర లేకపోవడం, తన శరీరానికి సరియైన వ్యాయామం ఎక్ససైజ్లు లేకపోవడం వలన, ఎక్కువగా ఈ సమస్యలు బారిన పడుతూ ఉంటారు.
మనిషి ఇలా చేయకపోవడం వలన శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్త ప్రసన్న అనేది సరియైన పద్ధతిలో జరగబోవడమే కారణం అంటున్నారు. వైద్యనిపులు, గుండెకు రక్త ప్రసన్న అనేది సరియైన పద్ధతిలో జరగకపోతే గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉంది అని తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో చేతులు కాళ్లు తిమ్మిర్లు రావడం, అలాగే నొప్పి కూడా రావడం మొదలవుతుంది. శరీరంలో కొన్ని ఎముకలు పట్టుకుపోవడం, మనిషి సరిగా నడవలేకపోవడం, ఇలాంటి లక్షణాలు అన్ని బయటపడినప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయాయని అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో డాక్టర్ని కలిసి దానికి చికిత్స పొందాలి. అంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను ఎలా తగ్గించాలి. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇలాంటి వ్యాధితో బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అదేవిధంగా ఒక 45 నిమిషాలు వ్యాయామం కానీ, వాకింగ్ కానీ చేయాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్ టైం లో ఎక్కువగా మొలకలు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం లోకి ఎక్కువగా కూరలను పెట్టుకుని తక్కువ రైస్ ను తీసుకోవాలి.
అదేవిధంగా సాయంకాలం నాలుగు ఐదు రకాల ఫ్రూట్స్ ను సలాడ్ లాగా చేసుకొని తింటూ ఉండాలి. సాయంకాలం భోజనం చేయాలి అనుకున్నవారు 6 గంటలకు లోపే తినేసేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది నియంత్రణలో ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.