Health Tips : నానబెట్టిన బాదం ఉదయం పరిగడుపున తింటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి…!
Health Tips : డ్రై ఫుడ్స్ లో అత్యంత ముఖ్యమైనది, విలువైనది, ఖరీదైనది అంటే బాదంపప్పు. ఈ బాదం పప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. కరోనా సమయంలో డ్రై ఫ్రూట్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వ్యాధి ఎటువంటిదైనా పౌష్టికాహారంతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని ప్రజలు అనుకోవడంతో బాదం, ఖర్జూరం, జీడిపప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ ని అధికంగా తీసుకుంటున్నారు.. అయితే ఈ డ్రై ఫుడ్స్ లో అన్నిటికంటే ఈ బాదంపప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. జిమ్ లో వర్క్ అవుట్ చేసేవారు,
బరువు తగ్గాలనుకునేవారు రోజు డైట్ లో తప్పనిసరిగా ఈ బాదంపప్పును తీసుకుంటూ ఉంటారు. దీనిని ఎక్కడికి అయినా సరే తేలిక తీసుకెళ్లడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి చాలామంది బాదంపప్పును ఇష్టంగా తింటూ ఉంటారు. బాదం పప్పుని డైరెక్ట్ గా తీసుకోకపోయినా డిసార్ట్స్ జ్యూస్ లు లాంటి వాటి తో ప్రతి ఒక్కరు తప్పకుండా భాదాన్ని వాడుతూ ఉంటారు. అయితే చాలామంది బాదంపప్పును రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తీసుకుంటూ ఉంటారు. అయితే పచ్చిబాదం పప్పు కంటే నానబెట్టిన, బాదంపప్పు ద్వారానే ఎక్కువ ఉపయోగం ఉంటుందని
చాలామంది నమ్ముతుంటారు.. అయితే ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరం:పచ్చి బాదంపప్పు లేదా నానబెట్టిన బాదం ఈ రెండిట్లో ఏది మంచిది అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఇంకొందరైతే నానబెట్టిన బాదం పప్పు మంచిదని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే తాజా పరిశోధనలో పచ్చి బాదంపప్పు లేదా నానబెట్టిన బాదంపప్పు ఏది తీసుకున్న ఒకటే అని పరిశోధనలో బయటపడింది. నానబెట్టిన బాదంపప్పు మంచిది. అనే వాదన కేవలం మీ అపోహ మాత్రమే అని బయటపడింది.
బాదంపప్పును ఏ రూపంలో ఉన్న అందులో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి టు విటమిన్ ఈ లాంటి వాటిలలో ఎటువంటి తేడాలు ఉండవని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే నానబెట్టిన బాదంపప్పు తీసుకోవడానికి సులభంగా ఉండటంతో చాలామంది ఆ విధంగా తింటూ ఉంటారు. అని అంటున్నారు. బాదంపప్పు ఆరోగ్యకరమైనది పౌష్టికాహారమని ఏ విధంగానైనా తీసుకోవచ్చు అని నిరభ్యంతరంగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే నానబెట్టేనా బాదంపప్పు అయినా తీసుకోవచ్చు. లేదా పచ్చి బాదంపప్పు అయినా తీసుకోవచ్చు అని వైద్య నిపుణులు తెలియజేశారు..