Health Tips : గోర్లు ఈ కలర్ లో మారాయంటే… ఈ సమస్య ఉన్నట్లే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Tips : గోర్లు ఈ కలర్ లో మారాయంటే… ఈ సమస్య ఉన్నట్లే…!

Health Tips : కొంతమంది గోర్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొందరైతే వాటిని అందం కోసం పొడవుగా పెంచుకుంటారు. అయితే గోర్లు కలర్ మారితే మనం అనారోగ్యం బారిన పడినట్లే. శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇలానే గోర్లు పసుపు రంగులో కనిపించిన లేదా గోర్లలో పగుళ్ళు, కొరుకుదనం ఉంటే జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. గోళ్ళల్లో మార్పు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ లక్షణాలన్నీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,6:00 am

Health Tips : కొంతమంది గోర్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొందరైతే వాటిని అందం కోసం పొడవుగా పెంచుకుంటారు. అయితే గోర్లు కలర్ మారితే మనం అనారోగ్యం బారిన పడినట్లే. శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇలానే గోర్లు పసుపు రంగులో కనిపించిన లేదా గోర్లలో పగుళ్ళు, కొరుకుదనం ఉంటే జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. గోళ్ళల్లో మార్పు రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ లక్షణాలన్నీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే లక్షణాలు కూడా కావచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు.

శరీరంలో ఆరోగ్యకరమైన కణాల ఏర్పాట్లను కొలెస్ట్రాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే కొలెస్ట్రాల్ పెరగడం వలన కొన్ని సమస్యలు తలెత్తుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మన శరీరం ముందుగా అనేక సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలను గుర్తించి సరైన సమయంలో వైద్యం చేయించుకోవడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరం కాళ్లు, తొడలు, తుంటి, దవడలు, కాళ్లలో తిమ్మిరి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ తిమ్మిర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు చర్మం పసుపు లేదా నీలం రంగులో కనిపించడం మొదలవుతుంది. చేతులు, కాళ్ల గోర్లు మందగించడం కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెరిగింది అనడానికి ఓ సంకేతం.

Health Tips Nails in yellow colour cause bad cholesterol

Health Tips Nails in yellow colour cause bad cholesterol

అందువల్ల వాటిని సరైన సమయంలో గుర్తించాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు పాదాలకు రక్తప్రసరణ సరిగా ఉండదు. ఈ కారణంగా కొన్నిసార్లు పాదాలు మొద్దు బారడం మొదలవుతుంది. ఇలా జరిగినప్పుడల్లా పాదాలలో జలదరింపుల వణుకు లాంటివి కూడా వస్తాయి. కావున దీనిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఒక కాలు ఉష్ణోగ్రత మరొక కాలు కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. ఇది కాకుండా రక్తనాళాలలో కొలెస్ట్రాల్ కారణంగా ఫలకం పేరుకుపోయినప్పుడు రక్తప్రసరణ మందగిస్తుంది. దీంతో కాళ్లకు రక్తం సరిగ్గా అందక ఈ సమస్య వస్తుంది. దీనివలన చాలాసార్లు పాదాల ఉష్ణోగ్రత తగ్గి చల్లగా మారడం మొదలవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది