Health Tips : దురద, కంటి వాపు లక్షణాలు కనిపిస్తే… కిడ్నీలకు ప్రమాదమే…
Health Tips : మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో ఏర్పడిన వ్యర్ధాలను కిడ్నీలు తొలగిస్తాయి. శరీరంలోని కణాలలో ఏర్పడిన యాసిడ్ కిడ్నీ సహాయంతో తగ్గుతుంది. రక్తంలో నీరు, సోడియం, క్యాల్షియం, బాస్వరం, పొటాషియం వంటి మూలకాలు వాటిని బ్యాలెన్స్ చేసే పనిని మూత్రపిండాలు చేస్తాయి. కిడ్నీలో ఎలాంటి సమస్యలు వచ్చినా శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అందువలన కిడ్నీలను ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాల ఆరోగ్యం పై ప్రభావం పడితే తీవ్రమైన వ్యాధిగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు.
కిడ్నీలు జాగ్రత్తగా చూసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని పేర్కొంటున్నారు. కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలను పాటించాలి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరంలో ఎప్పుడు నీటి కొరత ఉండకూడదు. ప్రతిరోజు సరిపడనంత మంచినీరు త్రాగడం చాలా ముఖ్యం. కిడ్నీ దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి దాని గురించి అజాగ్రత్తగా ఉండకూడదు. అయితే సాధారణంగా మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు కిడ్నీ సమస్యలకు సంకేతాలుగా కనిపిస్తాయి. అయితే కళ్ళు, చర్మం సహాయంతో మీరు కిడ్నీల పరిస్థితిని తెలుసుకోవచ్చు.
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. చర్మం పొడి బారడం, పొట్టు, దురద వంటి సమస్యలు రావచ్చు. నిజానికి కిడ్నీలు మన రక్తంలోని టాక్సిన్ లను శుద్ధి చేసి స్వచ్ఛమైన రక్తాన్ని చర్మానికి పంపుతాయి. ఇది సరిగ్గా పని చేయకపోతే వివిధ చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మన రక్తంలో విష పదార్థాలు పెరిగినప్పుడు తీవ్రమైన వ్యాధులకు కారణమని భావిస్తారు. అలాగే కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చిన కంటి సమస్యలు కూడా వస్తాయి. కంటి వాపు అనిపించిన కంటి చూపు స్పష్టంగా లేకపోయినా వెంటనే కిడ్నీలను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.