Health Tips : దీన్ని తిన్నారంటే తెలివితేటలు పెరుగుతాయి… ఎంత తింటే అంత బలం…
Health Tips : మెదడు అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అలాగే అందరికీ ఏకాగ్రత అనేది ఉంటుంది. ఏకాగ్రత లేకుండా పుట్టుకతో లోపం అనేది ఏమీ ఉండదు. ఇష్టాలు, అయిఇష్టాలు అనేదాన్ని బట్టి ఏకాగ్రత నిలవడం లేకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. కొందరికి చదవడం ఇష్టం, మరికొందరికి ఆడుకోవడం ఇష్టం, కొంతమందికి సినిమాలు చూడడం ఇష్టం. ఇలా ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి. దాన్నిబట్టి వాళ్లకి ఏకాగ్రత అనేది నిలకడగా ఉంటుంది. వాళ్లకి ఇష్టమైన పని చేసినప్పుడు చాలా శ్రద్ధ ఉంటుంది. వాళ్లకి ఆ సమయంలో నిద్ర కూడా పట్టదు ఏకాగ్రతతో పని చేస్తారు. మనిషికి వ్యాయామం అనేది చాలా అవసరం. అది లేకపోతే బద్ధకం చేస్తుంది.
ఒక మనిషికి ఏకాగ్రత లేకపోతే ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ఆవలింతలు ఎందుకు వస్తాయంటే మన బ్రెయిన్ వేడెక్కినప్పుడు దాన్ని చల్లార్చడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలి. అంతేకాకుండా ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ప్రాణాయామం, వ్యాయామం, ఆసనాలు ఇలాంటివి చేయడం వలన రక్తప్రసరణ జరిగి శరీరం యాక్టివ్ గా ఉండడంతోపాటు మెదడు కణాలకు చేరుతుంది. దీని వలన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి తోడు ధ్యానం కూడా బాగా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. నిద్రకి ఏకాగ్రతకు కూడా సంబంధం ఉంటుంది. ఎంత ఎక్కువ నిద్రపోతే అంత ఎక్కువ ఏకాగ్రత అనేది వస్తుంది.
నిద్ర సరిగా లేకపోతే బ్రెయిన్ యాక్టివ్ గా ఉండదు. ఎందుకంటే మెదడు పనిచేసినప్పుడు మెదడులోనే కణజాలంతా కూడా వ్యర్ధాలను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే మనం నిద్రపోతాము అప్పుడు మెదడు కణాలు రిలాక్స్ అవుతాయి. కొత్తగా వ్యర్ధ పదార్ధాలు తయారు కావు. పాత వ్యర్ధాలు అన్ని నైట్ టైం రెస్ట్ లో శరీరం క్లీనింగ్ మెకానిజం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి బ్రెయిన్ సెల్స్ ని ఉదయానికల్లా రీఛార్జ్ చేసి పెడుతుంది. అలాగే మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఏకాగ్రత అనేది ఆధారపడి ఉంటుంది. ఉడికిన ఆహారం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ప్రకృతిలో దొరికే ఆహార పదార్థాలను తీసుకుంటే ఏకాగ్రత అనేది వస్తుంది. నట్స్, సలాడ్స్, జ్యూస్ లాంటివి తీసుకుంటే బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. తాజా ఆహారం తీసుకోవడం వలన మెదడులో ఏకాగ్రత పెరిగి పని చేయడానికి సహాయపడుతుంది.