Health Tips : ఇది తాగితే చక్కటి కంటిచూపు మీ సొంతం..!!
Health Tips : ఇప్పుడు చాలామందికి ఇంట్లో మొక్కలను పెంచుకోవడంపై ఆసక్తి కనబడుతుంది. చిన్న చిన్న కుండీలలో వేసుకుని ఫ్రెష్ గా కోసుకొని వాడుకునే అలవాటు కనబడుతుంది. ఎక్కువ ప్లేస్ లేని కారణంగా కొంతమంది డాబా మీద టెర్రస్ పైన గార్డెన్స్ పెట్టుకుంటున్నారు. ఇంటి చుట్టూ ప్రక్కల చిన్న చిన్న ముక్కలు పెంచుకుంటున్నారు. స్థలం లేని వాళ్ళు పెద్ద ప్లాస్టిక్ ట్రేలలు లేదా చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు తెచ్చుకొని కొబ్బరి పొట్టు వేసుకొని కొంచెం మట్టి వేసుకొని మొక్కలను పెంచుకోవచ్చు. కొబ్బరి పొట్టు ఎక్కువగా వేయడం వలన కుండీలు తేలికగా ఉంటాయి. తాడుతో ఇంటి ఎదురుగా కట్టుకొని కూడా పెంచుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల మూడు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు పెంచుకొని మీరు ఉపయోగించవచ్చు. శరీరంలో కణజాలం జబ్బులు బారిన పడకుండా కాపాడడానికి యాంటీ ఆక్సిడెంట్ సహాయపడతాయి. అలాగే రాడికల్స్ తగ్గటానికి బాడీ ఆరోగ్యంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే మూడింటిని మన ఇంట్లో పెంచుకొని వాడుకోవచ్చు. అవే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఒక పెద్ద ప్లాస్టిక్ కుండీల్లో ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి మట్టి కిందకు దిగిపోకుండా పైన గులకరాళ్లు వేసుకొని చుట్టూ రంధ్రాలు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కుండీలకు ఎండ పడేలాగా పెట్టుకోవాలి. కరేపాకు విత్తనాలను కుండీలలో వేసి పెంచుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం కరివేపాకు వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తాం. అలాగే కరివేపాకులో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటాయి. కరివేపాకు లోని కాల్షియం పాలలోకంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు ముదురు ఆకులు కాకుండా లేదా ఆకులు తింటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. కరివేపాకును దూసి తీసుకెళ్లి పోవడం కాకుండా కొమ్ములు వీరుస్తూ ఉండటం వలన కొత్త చిగురు వస్తుంది. ఇలా పెంచుకోవడం వలన తాజా కరివేపాకు దొరుకుతుంది. దీని వలన కంటిచూపు తగ్గకుండా ఉంటుంది.
పుదీనా మార్కెట్లో తెచ్చుకొని ఆకులు తీసుకున్న తర్వాత కొమ్మలను కుండీలలో కుచ్చడం వలన పెరిగిపోతుంది. పిలకలు కత్తిరించే కొద్దీ మళ్ళీ మొలకలు వస్తూ ఉంటాయి. కొత్తిమీర కూడా ధనియాలను కుండీలలో చల్లడం ద్వారా వస్తుంది. కొబ్బరి పొట్టు, కొంచెం మట్టి ట్రేలలో వేసి ధనియాలు చల్లడం వలన కొత్తిమీర వస్తుంది. కొత్తిమీర పెరిగిన తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ ధనియాలు చల్లితే కొత్త కొత్తిమీర వస్తుంది. ఈ మూడింటిలోనూ విటమిన్ ఏ ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. రక్త వృద్ధికి, కంటిచూపు మెరుగుపరచడానికి ఇవి ఉపయోగపడతాయి. కొత్తిమీరని కట్ చేసి జ్యూస్ స్నాక్స్ లో వెజిటేబుల్స్ పైన చల్లుకుని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.