Health Tips : ఆగిన నెలసరిని వచ్చేలా … నెలసరి సమయంలో వచ్చే నొప్పిని ఆగేలా అద్భుతమైన చిట్కా…
Health Tips : చాలామంది మహిళలు పీరియడ్ సమయంలో ఎంతో కడుపునొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో చాలామంది కొన్ని టాబ్లెట్లను అలాగే ఇంజక్షన్స్ను తీసుకుంటూ ఉంటారు. ఈ విధమైన నొప్పిని డిస్మి నోరియ అని అంటారు. ఈ నొప్పి గల కారణాలు.. కొందరి మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. పలువురికి ఈ సరిపోక కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇలా జరుగుటకు కారణాలు హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ ఈస్ట్రోజన్, ప్లక్షషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా చాలామంది బయట ఫుడ్ ఉంటే జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం కూడా ఒక కారణం, ఈ ఫుడ్ వల్ల హై కార్బోడైట్ దీని ద్వారా వెళ్లడం, వలన హార్మోన్ ప్లక్షషన్స్అధికంగా వస్తాయి.
ఇలా ఇది ఎక్కువగా ఉత్పత్తి జరిగినప్పుడు గర్భాశయంలో సంకోచాలు అనేవి అధికమైపోతాయి. ఇలా ఎక్కువగా ముడుచుక పోవడం వలన నొప్పి బాగా వస్తుంది. రక్తస్రావరణ అధికంగా అవడంతో దానిద్వారా నొప్పి కూడా ఎక్కువ రావడానికి కారణం అవుతుంది. దీనికి పూర్తి నివారణ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆహారంలో కొన్ని మార్పులు, మొలకలు, సలాడ్సు ,ఆకుకూరలు ,ఫ్రూట్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకోవడం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం ఆగిపోతుంది.
అదేవిధంగా అధిక కొవ్వు కూడా సహజంగా తగ్గుతుంది. ఇలా ఆహారంలో మార్పు చేసుకోవడం వలన పూర్తి ఉపశమనం కలుగుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక బట్టలొ ఐసు ముక్కలను ఉంచి దానిని మూటకట్టి నొప్పి వచ్చే ప్రదేశంలో ఒక ఐదు నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంచడం వలన ఈ చల్లదనానికి ఈ నొప్పి తగ్గిపోతుంది. ఈ ఐస్ ప్యాక్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు పెట్టుకున్నట్లయితే దీని నుండి పూర్తి ఉపశమనం కలుగుతుంది.