Heart Attack : శీతాకాలంలో వీటిని తీసుకుంటే స్ట్రోక్ రిస్క్ తగ్గుదల..!
Heart Attack : ఏ సీజన్‌లో దొరికే ఆహార పదార్థాలను ఆ సీజన్‌లో కంపల్సరీగా తీసుకోవాలని పెద్దలతో పాటు పోషకాహార నిపుణులు చెప్తుంటారు. అలా ఈ సీజన్‌లో లభించే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని వివరిస్తుంటారు. కాగా, చలికాలంలో వీటిని తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అలా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన హ్యూమన్ బాడీలో వచ్చే చేంజెస్ అన్ని శరీరాన్ని ఇంకా బలోపేతం చేస్తాయి.
అలా శీతాకాలంలో ప్రతీ ఒక్కరు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్‌లో ఒకటి సజ్జలు. వీటిని ఇంగ్లిష్‌లో పెరల్ మిల్లెట్స్ అని పిలుస్తుంటారు. మహారాష్ట్రలో వీటిని బజరా భక్రి అని అంటారు. ఇవి హెల్దీ ఫుడ్ మాత్రమే కాదు న్యూట్రీషియస్ ఫుడ్ కూడా. ఇందులో ఉండే విటమిన్స్ హ్యూమన్స్‌కు కావల్సినవి. సజ్జల్లో ఉండే పొటాషియం, మెగ్నిషియం మినరల్స్.. బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్ చేస్తాయి. ఫలితంగా హార్ట్ స్ట్రోక్ రిస్క్ కూడా తగ్గుతుంది. సజ్జల్లో ఉండేటువంటి కాంప్లెక్స్ కార్బ్స్ హ్యూమన్ బాడీని అతి ఆకలి లేకుండా చేస్తాయి. ఫలితంగా వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇకపోతే సజ్జల్లో ఉండే ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్ లెవల్స్ అమాంతం పెరగకుండా చేస్తాయి. సజ్జల్లో ఉండే ఫైబర్ ప్రీ బయోటిక్ లాగా పని చేసి హ్యూమన్స్‌ను హెల్దీగా ఉంచుతాయి.
Heart Attack : ఈ సీజన్ లో వీటిని తీసుకుంటే అనారోగ్యాలన్నీ దూరం..
సజ్జలో వేడిని కలిగించే గుణం ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకున్నట్లయితే శరీరంలో వేడి కలుగుతుంది. ఇకపోతే సజ్జలను యాస్ ఇట్ ఈజ్‌గా కాకుండా రెసిపీగా తీసుకుంటే మంచిది. రెసిపీ రెడీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. రెండు కప్పుల సజ్జల పిండికి, మూడు కప్పుల వాటర్ తగినంత, ఉప్పు, నెయ్యి యాడ్ చేసి వంటకంగా మార్చుకుని తీసుకోవాలి. ఇలా సజ్జలను రెసిపీ మాదిరిగా మార్చుకుని తీసుకున్నట్లయితే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి.