Heart Attack : గుండెపోటు ప్రమాదం ఎవరికి ఎక్కువా … ఆడవారికా.. మగవారికా…!
ప్రధానాంశాలు:
Heart Attack : గుండెపోటు ప్రమాదం ఎవరికి ఎక్కువా ... ఆడవారికా.. మగవారికా...!
Heart Attack : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. అలాంటి వాటిలో సైలెంట్ కిల్లర్ అయినటువంటి గుండెపోటు కూడా ఒకటి. ప్రస్తుతం చాలా మరణాలు గుండెపోతుతోనే వస్తున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయంగా నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు కండరాలకు తగినంత రక్తం,ఆక్సిజన్ అందనప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి ఇది. దీనిని సాధారణంగా కరోనరీ ఆర్టరీ అని పిలుస్తారు. అయితే ఇది గుండె సిరలలో అడ్డుపడడం వలన ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే మహిళల కంటే కూడా ఎక్కువగా గుండెపోటు అనేది పురుషులకే వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది భావిస్తారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. అదే టైమ్ లో గుండెపోటు లక్షణాలు మరియు ప్రమాదకరకాలు, అనేవి పురుషులు మరియు స్త్రీలలో కొంచెం భిన్నంగా ఉంటుంది. అవేమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Heart Attack : మహిళల్లో గుండెపోటు ప్రమాద కారకాలు
-55 సంవత్సరాలు పైబడిన మహిళల్లో గుండె పోటు అనేది పెరుగుతుంది.
– మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే గుండెపోటు లేక స్ట్రోక్ ఉన్నట్లయితే మీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.
– గుండె సమస్యలకు అధిక రక్తపోటు కూడా ఒక ప్రధాన కారణం.
– మధుమేహం గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
– అధిక కొలెస్ట్రా స్థాయిలు శరీరంలో ఫలకం పేరుకుపోవడం కూడా ఒక కారణం. ఇది గుండె ప్రమాదాలను కూడా పెంచుతుంది.
– ధూమపానం కూడా గుండె సమస్యలకు ప్రధాన కారణమే.
– ఊబకాయం కూడా గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
– ప్రతి నిత్యం కూడా వ్యాయామం చెయ్యకపోవటం వలన గుండె సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.
– ఒత్తిడి వల్ల కూడా గుండె సమస్యల ప్రమాదాలు పెరుగుతాయి.
-డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా గుండె ప్రమాదాలను పెంచుతుంది.
-కొన్ని రకాల గర్భనిరోధక మూత్రాలు కూడా గుండె సమస్యల ప్రమాదాలను పెంచుతుంది..
Heart Attack : పురుషులలో గుండెపోటు ప్రమాద కారకాలు
-45 సంవత్సరాల పైబడిన పురుషులలో కూడా గుండె పోటు అనేది పెరుగుతుంది.
-మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే గుండె పోటు లేక స్ట్రోక్ ఉన్నట్లయితే మీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.
– మధు మేహం కూడా గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
-అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు శరంలో ఫలకం పేరుకు పోవడం దీనికి ఒక కారణం. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
– ఊబకాయం కూడా గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచగలదు.
-ప్రతి రోజు వ్యాయామం చేయడం వలన కూడా గుండె సమస్యల ప్రమాదం అనేది పెరుగుతుంది.
-ఒత్తిడి వల్ల కూడా గుండె సమస్యల ప్రమాదాలు పెరుగుతాయి.
Heart Attack : గుండెపోటు ప్రారంభ లక్షణాలు
1. చాతి నొప్పి లేఖ ఒత్తిడి లేక బిగుతుగా ఉండడం.
2. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.
3. చల్లని చమటలు పట్టడం.
4. వికారం లేక వాంతులు.
5. దవడ, మెడ లేక చేయి నొప్పి.
6. మైకము లేక తల తిరగడం.
గుండెపోటు ప్రమాదం అనేది మహిళలు మరియు పురుషులకు ఇద్దరికీ కూడా ఒక తీవ్రమైన ఆరోగ్యం ముప్పు అని చెప్పొచ్చు. దీని మొదలు సంకేతాలను కనుక తెలుసుకున్నట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. గుండె సమస్యల ప్రమాద కారకాలను తగ్గించటం వలన మీరు గుండెపోటు ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా గడపవచ్చు..