Heart Attack : ఈ ఆకులు తిన్నారంటే .. హార్ట్ ఎటాక్ అస్సలు రాదు ..!
Heart Attack : చిలకడ దుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే చిలకడదుంప ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాములు చిలకడ దుంపల ఆకులలో 42 క్యాలరీల శక్తి ఉంటుంది. 9 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల ప్రోటీన్, జీరో గ్రాముల ఫ్యాట్, 5.3 గ్రాముల ఫైబర్, 11 మిల్లి గ్రాముల విటమిన్ సి, 508 మిల్లీ గ్రాముల పొటాషియం వీటన్నింటికీ మించి చిలకడదుంప ఆకులలో 14720 మైక్రోగ్రాముల లూటీన్, జియోగ్జాన్తిన్ కెమికల్స్ ఉంటాయి. అలాగే ఈ ఆకుల్లో 24 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాలలో ఉండే డిఎన్ఎ ను రిపేర్ చేసి ఆరోగ్యంగా ఉండేటట్లు చిలకడదుంప ఆకులు చేస్తాయి.
దాని వలన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ కణాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. లింపో సైట్ యొక్క డిఎన్ఏ ను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. రక్తనాళాలకు గోడల్లో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. గుండె రక్తనాళాలలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వలన హార్ట్ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి చోట్ల కొవ్వు పేరుకోకుండా చిలకడ దుంప ఆకు సహాయపడుతుంది. చిలకడదుంప లో ఉండే పోషకాలు కొవ్వు ఆక్సీకరణ చెందకుండా, కొవ్వు పాడైపోకుండా చేస్తుంది. చిలకడదుంప ఆకుల్లో ఉండే కొన్ని ప్లేవనాయిడ్స్ లివర్లో సైట్ ప్రొటెక్టివ్ ఎంజైమ్స్ ని ఎక్కువ విడుదల అయ్యేలా చేస్తుంది.
లివర్ కణాలను కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. లివర్ సేల్స్ లో చేరే ఫ్రీ రాడికల్స్ లివర్ కణాలను పాడు చేస్తు ఉంటాయి. చిలకడదుంప ఆకులలో ఉండే 24 రకాల యాంటీ ఆక్సిడెంట్ లివర్ సేల్స్ ని కాపాడుతాయి. అందుకని లివర్ సెల్ పాడైపోకుండా కాన్సర్ కణంగా మారకుండా ఉండడానికి ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది. లివర్ సేల్స్ లోను కూపర్ సేల్స్ లోను, మైక్రో ఫేస్ కణాలను రక్షించడానికి ఈ చిలకడదుంప బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చిలకడ దుంప ఆకులు రక్తనాళాలలో కొవ్వు ఎక్కువగా పేరుకోకుండా చేస్తుంది.