Heart Problems : కోడిగుడ్డులోని పచ్చ సోన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వస్తాయా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Problems : కోడిగుడ్డులోని పచ్చ సోన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వస్తాయా…

 Authored By aruna | The Telugu News | Updated on :6 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Heart Problems : కోడిగుడ్డులోని పచ్చ సోన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వస్తాయా...

Heart Problems : మనం చాలా సాధారణంగా ప్రతిరోజు గుడ్డు తీసుకుంటూ ఉంటాం. కానీ అలా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి..గుడ్డు మన ఆరోగ్యానికి మంచిదేనా.. అసలు ఎలా ఉపయోగపడుతుంది.. గుడ్డులో తెల్ల సోన తినాల.. పచ్చసోన తినాలా.. అదేమైనా గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందా.. గుడ్డు వల్ల కేవలం ఉపయోగాలే ఉన్నాయా.. నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం… గుడ్డు అనేది అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలలో ఒకటి ఒక గుడ్డు మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు కలుగుతుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.. విటమిన్ బి12 విటమిన్ డి మరియు ఇతర అనేక ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి ఉండడం వల్ల రోజులు ఎక్కువ గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.. అదే విధంగా గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాసం లేకపోలేదు.. ఒకరోజు ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని నమ్ముతారు. గుడ్డు సోనలో కొలెస్ట్రాల అధికంగా ఉండడం దీనికి కారణం. ఒక గుడ్డు సుమారు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. తాజాగా వచ్చిన అధ్యయన ప్రకారం శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల కంటే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ తక్కువ ప్రభావం చూపిస్తుందని తెలిసింది. కాబట్టి ఒక గుడ్డులోని పచ్చ సోన తిన్న వచ్చే ఇబ్బందేమీ లేదు.. ఒకరోజు ఎన్ని గుడ్లు తినొచ్చు.. అనేదానికి సరైన సమాధానం చెప్పడం కష్టం. ఇది వ్యక్తికి వ్యక్తికి మరియు వారి ఆరోగ్యానికి కూడా భిన్నంగా ఉంటుంది. ఇటీవల అధ్యయనం ప్రకారం సగటు ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి ఏడు గుడ్లు వరకు ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు.

మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడకపోతే రోజులో మూడు గుడ్ల వరకు కూడా సులభంగా తినొచ్చు.. గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవి అధిక పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఆహారంలో వాటిని భాగం చేసుకుని తినొచ్చు.. కాకపోతే వేసవిలో ఎక్కువగా గుడ్లు తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుదలకు కారణం కావచ్చు. అంతే కాకుండా ఇది అతిసారాన్ని కూడా దారితీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కాబట్టి వేసవిలో వాటిని తక్కువగా తీసుకోండి. ఇప్పుడు గుడ్డు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా చూద్దాం.. విటమిన్ బి గుడ్డు లోఅధికంగా ఉంటుంది .ఇది ఎముకలను బలోపేతం చేయడానికి చాలా ముఖ్యం కోడిగుడ్లు విటమిన్ కి ఆరు పర్సెంట్ ఉంటుంది. విటమిన్ బి టు 15 శాతం వరకు ఉంటుంది. విటమిన్ బి ఫైవ్ ఏడు శాతం ఉంటే విటమిన్ బి12 వరకు ఉంటుంది. ఈ విటమిన్ లో ఫాస్ఫరస్ ఐరన్లు నీ శరీరంలోకి రావాలంటే పచ్చ సొన తప్పకుండా మీరు కలిపి తినాల్సి ఉంటుంది…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది