Health Tips : నరాల బలహీనతను తగ్గించే పుట్ట గొడుగుల గురించి మీకు ఈ విషయాలు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : నరాల బలహీనతను తగ్గించే పుట్ట గొడుగుల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :22 May 2022,2:30 pm

Health Tips : ఈ మధ్య కాలంలో చాలా మంది పుట్ట గొడుగులు తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వీటిని శాఖాహారంగా బావించడం మరియు వీటిలో బి కాంప్లెక్స్ పుష్కలంగా లభించడం వల్ల వీటి వినియోగానికి ఎక్కువగా కారణం అవుతోంది. అయితే వీటిలో కూడా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఎక్కువగా కనిపించే బటన్ ముష్రూమ్స్, మిల్క్ మష్రూమ్స్ కంటే ఓయ్ స్టర్ పుట్ట గొడుగులు మాత్రం ఎక్కువ పోషకాలను కల్గి ఉంటాయి. అవి చూడడానికి ఆల్చిప్పల్లా ఉండి పెద్దగా తెరుచుకున్న పువ్వులా ఉంటాయి. వీటి ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది.

high protein diet reduces heart attacks nerve weakness

high protein diet reduces heart attacks nerve weakness

ఇంకా వీటని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఓస్టెర్ పుట్ట గొడుగుల్లో ఫైబర్, విటామిన్లు, ఖనిజాలు, ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో కార్బో హైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు పుట్ట గొడుగుల్లో 86 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. అంటే 28 కేలరీలు, 5 గ్రాముల పండి పదార్థాలు, 3 గ్రాముల ప్రోటీన్, గ్రాము కొవ్వు, 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే రోజువారీ విలవలో 27 శాతం నియాసిన్, దీనిలో 22 శాతం పాంతోతేనిక్ ఆమ్లం, 8 శాతం చొప్పున ఫోలేట్, కోలీన్, పొటాషియం, భాస్వరం, 6 శాతం చొప్పున ఇనుము, జింక్ ఉంటాయి.

అంతే కాకుండా ఓస్టెర్ పుట్ట గొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని సెల్యులార్ నష్టాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న మరియు లేని 22 మందిలో చేసిన క అధ్యయనంలో ఓస్టెర్ పుట్ట గొడుగులు తీసుకోవడం వల్ల భోజనానంతరం రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లు కనుగొన్నారు. అలాగే ఓస్టెర్ పుట్ట గొడుగులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పైన పేర్కన్న ప్రయోజనాలతో పాటు ఓస్టెర్ పుట్ట గొడుగులు యాంటీ ట్యూమర్ లక్షణాలను కూడా కల్గి ఉందట. అలాగే గట్ ఆరోగ్య ప్రయోజనాలు, శోథ నిరోధక ప్రభావాలను కూడా కల్గి ఉన్నట్లు ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని వారంలో ఒక్క సారి అయినా తినడం వల్ల చాలా మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది