Health Problems : ఉప్పుతో ఇన్ని అనారోగ్య సమస్యలా… పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారంటే…!!
Health Problems : ప్రతి వంటింట్లో ఉండే ఉప్పును అధికంగా తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వంటలకు రుచిని అందించడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఉప్పు. ఈ ఉప్పు లేకపోతే ఏ ఆహారం అయినా రుచి ఉండదు. ప్రధానంగా ఉప్పు లేకుండా ఏ వంటకాన్ని అయినా ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎన్ని పదార్థాలు వేసిన వంటల్లో ఉప్పు సరిపోకపోతే ఆ వంటకు రుచి ఉండదు. అయితే వంటల్లో ఉప్పుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఎక్కువగా ఉప్పు వాడడం వలన ఆరోగ్యానికి డేంజర్ అని ఆ విధంగా తీసుకోవడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది తెలియక చాలామంది ఉప్పును అధికంగా తీసుకుంటూ ఉంటారు.
మరి ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నావో ఇప్పుడు మనం చూద్దాం… మితిమీరిన ఉప్పు అనేది మూత్రపిండాలకు హానిచేస్తుంది. నిద్రలేని సమస్యలు వస్తుంటాయి. అలాగే మూత్ర పిండాలు ఫెయిల్యూర్ కి దారితీస్తాయి. అధిక ఉప్పు తినడం వలన టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. లైంగిక జీవితాన్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన జీర్ణ క్రియ శక్తి సమతుల్యత దెబ్బతింటుంది. ఉప్పు మన కణాల పవర్ ప్లాంట్ అయిన మైటోకండ్రయా పనిచేయకుండా ఆపుతుంది. ఉప్పు అధికంగా తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రమాదం ఉంటుంది. అలాగే రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు గుండె సమస్యలు పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

How many health problems with salt
ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వలన శరీరంలోని నీరు నిలుపుదల జరుగుతుంది. దీని ఫలితంగా వాపు సమస్యలు కడుపుబ్బరం లాంటివి ఉంటాయి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ పెరుగుతుంది. ఈ విధంగా సోడియం లెవెల్స్ అధికంగా ఉంటే రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. తరచూ మూత్రం వస్తూ ఉంటుంది. ఈ సమస్య అధికంగా మహిళలకు వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఉప్పు అధికంగా తిన్నప్పుడు శరీర అవయవాల్లోని కణాలకు శక్తి సరఫరా తప్పుగా జరుగుతుంది. ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలోని కలిసి నీటి ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. దాని ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా అధికమవుతుంది. దాంతో ఎక్కువసార్లు మూత్రం కి వెళుతూ ఉంటారు.