Saliva Test : లాలాజల టెస్ట్ తో డయాబెటీస్ , క్యాన్సర్.. ఎన్ని రకాల వ్యాధులను గుర్తించవచ్చో తెలుసా..!
Saliva Test: లాలాజల నమూనా నుండి చాలా రకాల వ్యాధులను గుర్తించవచ్చు. మధుమేహం దగ్గర నుండి క్యాన్సర్ వరకు అన్ని వ్యాధులను లాలాజల నమూనా నుండి కనుక్కోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధి గురించి ఇన్వెస్టిగేషన్ కూడా సులువుగా అవుతుందట. ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వ్యాధులను కనుగొనవచ్చు. మానవ లాలాజలంతో దాదాపు 700 సూక్ష్మ జీవులు, యూరిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధనలో తెలిసింది.ఇందులో వ్యాధులను సూచించే రసాయనాలు కూడా ఉంటాయని వీటిని బట్టి వ్యాధులను తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం చాలా విషయాలకు సంకేతం అని చెబుతున్నారు.
లాలాజలంతో ఉండే యూరిక్ యాసిడ్, వ్యాధుల మధ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు. యూరిక్ యాసిడ్ కారణంగా రక్తపోటు అధికంగా పెరుగుతుంది.అంతే కాదు గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్, బ్లడ్ షుగర్, డయాబెటీస్ కొన్ని రకాల క్యాన్సర్ లను కూడా గుర్తించవచ్చు.. పురుషులలో కంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగ ఉన్న మహిళల్లో రక్తపోటు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది అని పరిశోధనలో తేల్చారు. అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అనేక రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం.
Saliva Test : క్యాన్సర్‌ను కూడా గుర్తించొచ్చు..
పెరుగుతుందని మరొక పరిశోధనలో తేల్చారు. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఒక రసాయనం.. ఇది ప్యూరిన్ ఆహారాల జీవక్రియ ప్రక్రియలో వెలువడుతుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది.. మిగిలినవి మాత్రమే మూత్రపిండాల ద్వారా విసర్జించ బడతాయి. కానీ ఈ పరిమాణం ఎక్కువ అయితే మూత్రపిండాలు వాటిని ఫిల్టర్ చేయలేవు.. అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇలా ఎన్నో రకాల వ్యాధులను లాలాజల టెస్టుతో గుర్తించ వచ్చన్న మాట.