Guava leaves Juice : జామ ఆకుల రసంతో ఇన్ని ఉపయోగాలా..మీకు తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guava leaves Juice : జామ ఆకుల రసంతో ఇన్ని ఉపయోగాలా..మీకు తెలిస్తే షాక్ అవుతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :26 June 2023,11:00 am

Guava leaves Juice : జామ పండ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో మనందరికీ తెలిసిన విషయమే.. ఈ జామ పండ్లలలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.. ఈ జామ పండు ఎన్నో రకాల వ్యాధులకు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. జామ పండు సహజంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఇప్పుడు జామ పండు కాకుండా జామ ఆకులతో కూడా ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. జామ ఆకు రసంలో ఉన్న పోషక గుణాలు గురించి తెలిస్తే మీరు వాటిని వదిలిపెట్టరు.
జామ ఆకులలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. జామకులలో ఉండే పోషకాలు వలన ఎన్నో సమస్యలకి చెక్ పెట్టవచ్చు..

ఈ జామకులలో సల్ఫర్, సోడియం, ఐరన్, బొరాన్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యాధిగ్రస్తులు జామాకుల రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.దీనిని నిత్యం తీసుకున్నట్లయితే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే చాలా ఆరోగ్యంగా ఉంటారు. జామ ఆకుల రసం కడుపుకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. గ్యాస్ లేదా ఎలాంటి రకమైన కడుపు సమస్య ఉన్న కచ్చితంగా ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వలన ఆ సమస్యలు తగ్గిపోతాయి..

how many uses of guava leaves juice

how many uses of guava leaves juice

Guava leaves Juice : ఈ జామ ఆకుల రసం ఎలా తీసుకోవాలి

జామ ఆకులను పంటి నొప్పికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. దంతాలను నోప్పితో ఇబ్బంది పడుతుంటే జామ ఆకు రసాన్ని తీసి పళ్ళపై అప్లై చేసుకోవచ్చు. అలాగే జామకులను లవంగాలతో మెత్తగా దంచి దంతాలపై అప్లై చేస్తే నొప్పి నుంచి త్వరగా బయటపడతారు.. జామ ఆకులలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది సిరలలోని చెడు కొలెస్ట్రాల్ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులను మిక్సీలో వేసి ఈ రసం తీసి నిత్యం తీసుకున్నట్లయితే ఊబకాయం నుంచి ఉపశమనం కలుగుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది