
How to cure diabetes with home remedies
Diabetes : ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య షుగర్. అదే మదుమేహ వ్యాధి. దీన్నే ఇంగ్లీష్ లో డయాబెటిస్ అంటారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు. మారుతున్న మనిషి జీవన శైలే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతోంది.
అయితే.. షుగర్ వస్తే.. ఇక జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలా? షుగర్ ను కంట్రోల్ చేయలేమా? నయం చేయలేమా? దీనికి ఇంటి చిట్కాలేవీ లేవా? మన ఇంట్లో ఉండే వాటితో.. షుగర్ ను తగ్గించలేమా? ఇంగ్లీష్ మందులు ఖచ్చితంగా వాడాల్సిందేనా? అటువంటి వాటికి సమాధానమే ఈ కథనం. షుగర్ ఎంతున్నా సరే.. కొన్ని చిట్కాలు పాటిస్తే.. కొన్ని నియమాలు పాటిస్తే.. 15 రోజుల్లో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
diabetes
షుగర్ రావడానికి ప్రధాన కారణం మనం తినే అన్నం. అవును.. మన భారతదేశంలో ఎక్కువగా అన్నం తినే వాళ్లలో తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి.మనం తినే బియ్యం బాగా పాలిష్ చేసినవి. వాటిలో ఉండే విటమిన్స్, మాంసకృత్తులు అన్నీ పోయి.. కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతాయి. కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే. బియ్యంలో 77 గ్రాములు కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఎక్కువగా అన్నాన్నే తింటూ ఉండటం అలవాటు చేసుకోవడం వల్ల.. షుగర్ వ్యాధి తొందరగా బాడీని అటాక్ చేస్తుంది.షుగర్ వ్యాధిని నయం చేయాలంటే ముందు అన్నం తినడం మానేయాలి. అలాగే చాలా మంది అన్నం ఎక్కువ కూర తక్కువ తింటుంటారు. కానీ.. అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినాలి. కురల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అందుకే కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తింటే.. షుగర్ వెంటనే డౌన్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూరలు ఎక్కువగా తినే వాళ్లకు అసలు షుగర్ రానే రాదు. ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది.
health tips: Which food to be taken by diabetes patients
షుగర్ ఎక్కువ ఉన్నవాళ్లు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినేవాళ్లకు 70 శాతం షుగర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే.. రోజుకు 2.5 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉప్పును వాడకూడదు.
రోజూ ఉదయమే మొలకెత్తిన విత్తనాలను తినండి. పరిగడుపున మూడు రకాల గింజలను తినండి. ఉదయం పూట టిఫిన్ బదులు.. మొలకలు, పండ్లను తీసుకోండి.
how to control diabetes with natural food
ఉదయం పూట ఖచ్చితంగా వ్యాయామం చేయండి. రోజూ ఉదయం అర్ధగంట చెమటలు పట్టేలా వ్యాయామం చేయండి. రాత్రి పూట అన్నం తిన్న తర్వాత ఓ అర్ధగంట నడవండి.
ఇది కూడా చదవండి ==> Mind Diet : శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్కటే డైట్.. ఇది పాటిస్తే చాలు.. రోగాలన్నీ మటాష్..!
ఇది కూడా చదవండి ==> Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!
ఇది కూడా చదవండి ==> Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> Mobile : నిద్ర లేవగానే మీరు వెంటనే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..?
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.