Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!
Turmeric Green Tea : మన జీవితంలో టీలు ఒక భాగం అయిపోయాయి. ఈ ప్రపంచంలో చాలా టీలు ఉన్నాయి. ఒక్కో టీది ఒక్కో ప్రత్యేకత. కొందరైతే పొద్దున లేస్తే పాలతో చేసిన చాయ్ తాగనిదే ఏ పనీ చేయలేరు. ఇంకొందరు కాఫీ తాగుతారు. ఈ మధ్య గ్రీన్ టీలు, లెమన్ టీలు, ఇతర టీలు బాగా ప్రాచుర్యం పొందాయి. చాలామంది రకరకాల టీలను తీసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన టీని వాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే.. ఇందులో కొన్ని ఆరోగ్యానికి మంచివి.. మరికొన్ని ఆరోగ్యానికి మంచివి కావు. ముఖ్యంగా చాయ్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

turmeric green tea health benefits telugu
ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా కూడా కొందరు చాయ్ ని వదలలేకపోతున్నారు. అటువంటి వాళ్లు ఆరోగ్యానికి లాభం చేకూర్చే టీలను తాగడం బెటర్. దాని వల్ల.. వాళ్లకు టీ తాగిన ఫీలింగ్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి టీలలో ముఖ్యమైనది పసుపు గ్రీన్ టీ. అవును.. పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుంటే.. మీరు నిత్యం ఇదే టీని తాగడానికి ఇష్టపడతారు.
Turmeric Green Tea : కాలేయాన్ని శుభ్రం చేయాలా? అయితే పసుపు గ్రీన్ టీని రోజూ తీసుకోండి
చాలామందికి కాలేయం సంబంధ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే.. కాలేయం రోజూ చాలా పనులు చేయాల్సి ఉంటుంది. మనం తినే ఆహారంలో మంచి, చెడు.. రెండింటిని వేరు చేసేది కాలేయం మాత్రమే. పోషకాలను ఇతర అవయవాలకు పంపించి… చెత్తను, వ్యర్థాలను బయటికి పంపించే ప్రక్రియను కాలేయం నిర్వహిస్తుంది. ఈ పని చేయాలంటే.. కాలేయం చాలా శుభ్రంగా ఉండాలి. దెబ్బ తినకుండా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోకపోతే.. కాలేయం దెబ్బ తింటుంది. దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

turmeric green tea health benefits telugu
అందుకే.. కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలన్నా.. లివర్ శుభ్రం కావాలన్నా.. పసుపు గ్రీన్ టీ తాగాల్సిందే. ఇది నిజానికి ఒక ఆయుర్వేద టీ. ఎందుకంటే.. ఈ టీ తయారీకి ఉపయోగించేవి అన్నీ ఆయుర్వేద గుణాలు ఉన్నవే. పసుపు గ్రీన్ టీ అంటే.. కాసింత పసుపును గ్రీన్ టీలో కలుపుకొని తాగడమే. పసుపు మన శరీరానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అందుకే దాన్న అన్ని కూరల్లో వాడుతుంటాం. అలాగే.. గ్రీన్ టీ కూడా. గ్రీన్ టీ కూడా శరీరానికి ఎంతో మంచిది. శరీరంలో ఉన్న విష పదార్థాలను తరిమికొట్టడంలో గ్రీన్ టీ ఎంతో దోహదపడుతుంది. అందుకే.. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీ తయారు చేసే విధానం ఇదే

turmeric green tea health benefits telugu
పసుపు గ్రీన్ టీని ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీ ఆకులు నీళ్లలో వేసి కాసేపు మరిగించాక.. అందులో కాసింత పసుపు వేయండి. మరో 5 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించి.. ఆ మిశ్రమాన్న వడపోయండి. దాన్ని ఓ కప్పులో తీసుకొని.. దానికి కాసింత తేనె కలపండి. ఇలా.. చేసిన పసుపు గ్రీన్ టీని ప్రతి రోజు పరిగడుపున తీసుకుంటే.. లివర్ శుభ్రం అవుతుంది.