Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!
Belly Fat : చాలామంది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం. అది చాలా సమస్యలను సృష్టిస్తోంది. పొట్ట భాగంలో, బొడ్డు ప్రాంతంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల.. చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలైతే.. బెల్లీ ఫ్యాట్ తో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీవన విధానంలో వచ్చే మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకే.. చాలామంది ప్రస్తుతం బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
ఊబకాయం సమస్య ఉన్నవాళ్లలో ఎక్కువ మంది బాధపడేది బొడ్డు సమస్యలతోనే. బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, పొట్ట భాగంలో కొవ్వు పెరగడం వల్ల.. చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే.. అందరి ఫోకస్ ప్రస్తుతం దీని మీద పడింది. అయితే.. బెల్లీ ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలి? నడుమును, బొడ్డును నాజూకుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Belly Fat : బొడ్డు కొవ్వు తగ్గాలంటే.. నెయ్యి తినాల్సిందే?
నెయ్యిని చాలామంది ఇష్టపడరు. కానీ.. నెయ్యిలో ఉన్న సుగుణాలు మరే దాంట్లో ఉండవు. నెయ్యిని నిత్యం తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే.. బరువు పెరుగుతారని అంటారు కానీ.. అది కేవలం అపోహ మాత్రమే. నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. చాలా సమస్యలు తగ్గుతాయి. బొడ్డు కొవ్వును తగ్గించడానికి నెయ్యి బాగా దోహదపడుతుంది. ఎందుకంటే.. నెయ్యిలో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బొడ్డు కొవ్వును తగ్గించి.. బొడ్డును నాజూగ్గా తయారు చేస్తుంది.
Belly Fat : నెయ్యిలో ఉండే విటమిన్లు ఇవే
నెయ్యిని మనం అన్ని వంటల్లో వాడుతుంటాం. నెయ్యిని చాలా పవిత్రంగా కూడా భావిస్తాం. అందుకే సంప్రదాయ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంట్లో విటమిన్ ఏ, ఈ, కే తో పాటు.. కాల్షియం, పొటాషియం లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. నెయ్యిని ఖచ్చితంగా ఆహారంలో రోజూ భాగం చేసుకోవాల్సిందే. అప్పుడే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి.. మనిషి నాజూగ్గా తయారవుతారు.నెయ్యిని నిత్యం తీసుకోవడం వల్ల.. అనవసర కొవ్వు కరగడంతో పాటు.. బరువు కూడా తగ్గుతారు. అలాగే.. డయాబెటిస్ వ్యాధి ఉన్న వాళ్లకు కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. షుగర్ కంట్రోల్ లో ఉండటానికి నెయ్యి దోహదపడుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉన్నా కూడా నెయ్యితో చెక్ పెట్టొచ్చు.