Mind Diet : శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఈ ఒక్క డైట్ పాటిస్తే మీ రోగాలన్నీ మటాష్..!
Mind Diet : మనిషికి రోగాలు వచ్చాయంటే.. అది ఆయన జీవన విధానమే. అంటే.. తన జీవన విధానం, తన ఆహారపు అలవాట్లే తనకు రోగాలను తెచ్చిపెడుతుంది. మనం తినే ఆహారమే మనపై ప్రభావం చూపిస్తుంది. అందుకే.. ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది ఆచీతూచీ ఆలోచించి అడుగు వేయాలి. ఏది తిన్నా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తినాలి. లేకపోతే.. లేనిపోని రోగాలు రావడం ఖాయం. ఈరోజుల్లో అసలే ఆహారం కూడా కల్తీ అవుతోంది. కెమికల్ ఫుడ్ ఎక్కువైపోయింది. అందుకే.. ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే పది కాలాల పాటు చల్లగా ఉంటాం. లేదంటే మన శరీరం రోగాల పుట్టగా మారుతుంది.
ఈ జనరేషన్ లో ఫుడ్ అనేది చాలా మారిపోయింది. వెనకటికి మన పెద్దలు ఏం తినేవారు? వాళ్లు ఇలా ఏది పడితే అది తినలేదు. వాళ్లు చాలా పౌష్ఠికాహారాన్ని తీసుకున్నారు. అందుకే.. ఎటువంటి రోగం, నొప్పి లేకుండా వందేళ్లు జీవించారు. కానీ.. ఈ జనరేషన్ లో మనిషి లైఫ్ టైమ్ తగ్గిపోయింది. దానికి కారణం మన ఆరోగ్య అలవాట్లే.
Mind Diet : పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?
నిజానికి.. మనం ఇప్పుడు తినే ఆహారం.. ఖచ్చితంగా రోగాలను తీసుకొస్తుంది. మనం ఖచ్చితంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిందే. ఏ ఆహారం తినాలి? అంటే దానికి నిపుణులు ఓ పేరు పెట్టారు. అదే మైండ్ డైట్. దీన్ని పాటించిన వారికి ఎటువంటి వ్యాధులు రావు. వచ్చినా కూడా అవి వెంటనే తగ్గిపోతాయి. ఎందుకంటే.. ఈ మైండ్ డైట్ లో ఉండే ఆహార పదార్థాలు అన్నీ పోషకాలు ఉన్నవే. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు.. ఇలా ఈ మైండ్ డైట్ లో అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు ఉంటాయి.
మైండ్ డైట్ ను పాటించే వాళ్లు ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కాకపోతే.. ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవద్దు. రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కేవలం.. పౌష్ఠికాహారాన్ని తింటూ.. ఎక్కువ విటమిన్స్, మినరల్స్, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలిగే ఫుడ్ ను తీసుకుంటూ ఉంటే.. చాలా రోగాలను నయం చేసుకోవచ్చు.
Mind Diet : మైండ్ డైట్ ద్వారా ఏ వ్యాధులను నివారించవచ్చు
మైండ్ డైట్ ను నిత్యం పాటించేవాళ్లకు ఎన్నో సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా ఈ మైండ్ డైట్ లో చెక్ పెట్టొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె జబ్బులు తగ్గుతాయి. అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుంది. హైబీపీ తగ్గుతుంది. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
ఇది కూడా చదవండి ==> Blood Cancer : బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? దాని లక్షణాలు ఏంటి?
ఇది కూడా చదవండి ==> Mobile : నిద్ర లేవగానే మీరు వెంటనే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..?
ఇది కూడా చదవండి ==> Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!
ఇది కూడా చదవండి ==> Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!