Diabetes : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఈ టీని నిత్యం తీసుకోండి.. షుగర్ ను తగ్గించుకోండి..!
Diabetes : డయాబెటిస్.. ఇదే ప్రస్తుతం అందరినీ తెగ ఇబ్బంది పెడుతోంది. ప్రపంచాన్నే వణికిస్తోంది. ప్రతి పది మందిలో ఐదారుగురికి షుగర్ వ్యాధి వస్తోంది. వయసుతో పని లేకుండా.. అందరినీ వేధిస్తోంది. అందుకే.. షుగర్ వ్యాధి అనగానే అందరూ తెగ భయపడుతున్నారు. షుగర్ ఒక్కసారి వస్తే.. ఇక జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకొని బతకాల్సిందే. షుగర్ ఒక్కసారి వచ్చాక.. ఇక జీవితాంతం తిండి విషయంలో కాంప్రమైజ్ కావాల్సిందే. షుగర్ వచ్చినవాళ్లు ఏది పడితే అది తినకూడదు. ఏం తినాలో.. ఏం తినకూడదో తెలుసుకోవాలి.

kakarakaya tea health benefits telugu for diabetes
అయితే.. డయాబెటిస్ ను తగ్గించడం కోసం.. ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి. అంతెందుకు మన వంటింట్లోనే షుగర్ వ్యాధిని తగ్గించే ఎన్నో ఔషధాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు. అందులో ఒకటే కాకరకాయ టీ. అవును.. కాకరకాయను కూర వండుకొని తింటారు కానీ.. ఇలా టీ కూడా చేసుకొని తాగుతారా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. కాకరకాయతో జ్యూస్ చేయొచ్చు.. కాకరకాయతో టీ కూడా చేయొచ్చు. కాకరకాయతో చేసిన టీని తాగితే.. మీరు వద్దన్నా కూడా షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. మరి.. కాకరకాయ టీని ఎలా తయారు చేయాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం రండి.

kakarakaya tea health benefits telugu for diabetes
Diabetes : కాకరకాయ టీని ఎలా తయారు చేయాలి?
కాకరకాయ టీని చాలా సులభంగా తయారు చేయొచ్చు. ముందు.. కాకరకాయలను తీసుకొని.. వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఆ ముక్కలను ఎండలో ఎండబెట్టండి. ఆ తర్వాత ఆ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని.. కొన్ని నీళ్లు పోసి.. దాన్ని బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టండి. వడకట్టిన తర్వాత వచ్చిన నీటిలో కాసింత తేనె, నిమ్మరసం కలిపేయండి. అదే కాకరకాయ టీ. దాన్ని రోజు రెండు సార్లు.. ఒక్కో కప్పు చొప్పున తాగండి. దీని వల్ల రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

kakarakaya tea health benefits telugu for diabetes
కాకరకాయ టీ వల్ల.. కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ లో ఉంచుకోవడం కాదు.. దాని వల్ల క్యాన్సర్ కణాలు కూడా నాశనం అవుతాయి. దీని వల్ల.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తప్పుతుంది. అలాగే.. శరీరంలోని విష పదార్థాలను కాకరకాయ టీ బయటికి పంపిస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్లు కూడా కాకరకాయ టీని తాగితే.. బరువు తగ్గుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

kakarakaya tea health benefits telugu for diabetes
ఇది కూడా చదవండి ==> ఉల్లిపాయ రసం అమృతం లాంటిది.. నిత్యం దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> పంటినొప్పి తీవ్రంగా వేధిస్తోందా? ఈ వంటింటి చిట్కాలతో పంటినొప్పిని తగ్గించుకోండిలా..!
ఇది కూడా చదవండి ==> డయాబెటిస్ ఉన్న వారికి గుడ్ న్యూస్ …లాలాజలంతో షుగర్ పరీక్ష ?
ఇది కూడా చదవండి ==> టమాటాలు తింటే క్యాన్సర్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?