Yogasana : ఏ రాశి వారు ఏ యోగాసనం వేస్తే మంచిదో తెలుసా?
Yogasana : ప్రతి ఒక్కరికి ఏదో ఒక రాశి ఉంటుంది. ఆ రాశి ప్రకారం.. ఏం జరగాలో.. అదే జరుగుతుంటుంది. చాలామంది తమ రాశి ప్రకారం.. ఏం చేయాలో అది చేస్తుంటారు. ఉదాహరణకు ఏ రాశి వారు ఏ రింగ్ పెట్టుకోవాలి. ఎటువంటి ఉద్యోగం వస్తుంది. ఏ రాశి వారికి.. ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది.. అటువంటి విషయాలను తెలుసుకుంటారు. రాశి ఫలాలను కూడా కొందరు నమ్ముతారు. అయితే.. ఏ రాశి వారు ఏ యోగాసనం వేయాలో కూడా శాస్త్రంలో ఉంటుందట.
మామూలుగా యోగా చేయడం అంటే.. కొందరు తమకు తెలిసిన యోగసనాలను వేస్తుంటారు. అలా కాకుండా.. తమకు తెలిసిన యోగాసనం కాదు.. ఆయా రాశి వాళ్లు ఏ యోగాసనం చేస్తే మంచిదో జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.
Yogasana : మేష రాశి – Aries
మేష రాశి వాళ్లు… వేయాల్సిన ఆసనం ఏంటంటే.. నావాసనం. నావాసనం అంటే.. ముందు వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత పిరుదులపైనే శరీర బరువును వేసి.. రెండు కాళ్లు పైకెత్తాలి. ఆ తర్వాత రెండు చేతులను ముందుకు చాపాలి. ఈ ఆసనం వేస్తే రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలాగే.. పొట్ట ప్రాంతంలో కండరాలు కూడా దృఢంగా తయారు అవుతాయి.
Yogasana : వృషభ రాశి – Taurus
వృషభ రాశి వారు.. వృక్షాసనం వేస్తే మంచిది. వృక్షాసనం అంటే.. నిటారుగా నిలుచొని కుడి కాలి పాదాన్ని ఎడమకాలి తొడపైన పెట్టి.. రెండు చేతులను పైకి లేపి నమస్కారం చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల.. మనిషికి కోపం తగ్గుతుంది. సహనం పెరుగుతుంది. అలాగే.. తొడలు, కండరాలు బలపడుతాయి. ఎత్తు పెరగాలనుకునే వాళ్లు.. ఏకాగ్రత సరిగ్గా లేనివాళ్లు ఈ ఆసనం వేస్తే మంచిది.
Yogasana : మిథున రాశి – Gemini
మిథున రాశి వాళ్లకు గరుడాసనం మంచిది. గరుడాసనం అంటే.. రెండు చేతులను, కాళ్లను మెలి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత శ్వాసను నెమ్మదిగా వదలాలి. ఈ ఆసనం వల్ల.. కండరాలు గట్టిగా మారుతాయి. అలాగే.. ఈ ఆసనం వేయడం వల్ల.. శరీరం రిలాక్స్ అవుతుంది.
Yogasana : కర్కాటక రాశి – Cancer
కర్కాటక రాశి వాళ్లు బాలాసనం వేయాలి. మోకాళ్లపై కూర్చోవాలి. పాదాలను.. పిరుదులకు ఆనేలా చేయాలి. ఆ తర్వాత చేతులను ముందుకు చాచాలి. ఇలా చేస్తే.. మైండ్ రిలాక్స్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ మెరుగవుతుంది.
Yogasana : సింహ రాశి – Leo
సింహరాశి వాళ్లు భుజంగాసనం వేస్తేం మంచిది. భుజంగాసనం అంటే.. కాలి మడమలను బొటన వేళ్లతో కలిపి.. బోర్లా పడుకోవాలి. ముందు మకరాసనంలో ఉండి.. ఇలా చేయాల్సి ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు ఈ ఆసనం వేస్తే చాలా మంచిది. లోబీపీ ఉన్నవాళ్లు ఈ ఆసనం వేస్తే చాలా బెటర్.
Yogasana : కన్య రాశి – Virgo
ఈ రాశి వాళ్లు ఉత్కత కోనాసనం వేయాలి. ఈ ఆసనం కాళ్లకు బలాన్ని ఇస్తుంది. కండరాలను కూడా గట్టిగా చేస్తుంది. తొడలు కూడా గట్టిగా మారుతాయి.
Yogasana : తుల రాశి – Libra
తులా రాశి వాళ్లు.. అర్ధ చంద్రాసనం వేయాలి. దాని కోసం.. కుడి చేయిని నేలకు సమాంతరంగా చాచి.. అర చేయిని ఆకాశం వైపు చూసేలా తిప్పి.. ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. చాతి వద్ద వచ్చే సమస్యలను ఈ ఆసనం ద్వారా దూరం చేయొచ్చు.
Yogasana : వృశ్చిక రాశి – Scorpio
వృశ్చిక రాశి వాళ్లకు శలభాసనం మంచిది. పొట్ట భాగాన్ని, చాతిని, నేలకు తాకిస్తూ ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల.. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
Yogasana : ధనుస్సు రాశి – Sagittarius
ధనుస్సు రాశి వాళ్లు.. వీరభద్రాసనం వేయాలి. దీని కోసం నిటారుగా నిలబడాలి. చేతులను దగ్గరికి పెట్టి.. కాళ్లను వెడల్పు చాచి.. ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం వల్ల.. కాళ్లలో బలం చేకూరుతుంది.
Yogasana : మకర రాశి – Capricorn
ఈ రాశి వాళ్లు.. తాడాసనం వేయాలి. రెండు కాళ్లను దగ్గర పెట్టి.. శ్వాసను తీసుకోవాలి. అయితే.. కాలి వేళ్ల మీదనే నిలబడాల్సి ఉంటుంది. ఇలా చేస్తే.. పొట్ట కండరాలు, తొడ కండరాలు గట్టి పడుతాయి.
Yogasana : కుంభ రాశి – Aquarius
కుంభ రాశి వాళ్లు.. ఊర్ధ్వ ధనురాసనం వేయాలి. ఈ ఆసనం వల్ల.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
Yogasana : మీన రాశి – Pisces
మీన రాశి వాళ్లు.. మత్స్యాసనం వేయాలి. ఈ ఆసనం వేస్తే.. భుజాల నొప్పి తగ్గుతుంది. మెడ నొప్పి తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు.. ఈ ఆసనం వేస్తే మంచిది. శ్వాస కోస సమస్యలు ఉన్నవాళ్లు, బీపీ సమస్య ఉన్నవాళ్లు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి ==> ఉల్లిపాయ రసం అమృతం లాంటిది.. నిత్యం దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> పంటినొప్పి తీవ్రంగా వేధిస్తోందా? ఈ వంటింటి చిట్కాలతో పంటినొప్పిని తగ్గించుకోండిలా..!
ఇది కూడా చదవండి ==> డయాబెటిస్ ఉన్న వారికి గుడ్ న్యూస్ …లాలాజలంతో షుగర్ పరీక్ష ?
ఇది కూడా చదవండి ==> టమాటాలు తింటే క్యాన్సర్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?